కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో జమైకా తలైవాస్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జమైకా తలైవాస్ 37 పరుగులతో విజయాన్ని అందుకుంది. విండీస్ హార్డ్ హిట్టర్ షమ్రా బ్రూక్స్ కీలక సమయంలో సెంచరీతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీస్కోరు చేసింది. షమ్రా బ్రూక్స్(52 బంతుల్లో 109 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. రోవ్‌మెన్ పావెల్ 23 బంతుల్లో 37 పరుగులు చేయగా.. చివర్లో ఇమాద్ వసీమ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గయానా వారియర్స్ బౌలర్లలో రొమెరియో షెపర్డ్ రెండు వికెట్లు తీయగా.. తాహిర్, ఓడియన్ స్మిత్‌లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసింది. కీమో పాల్ 56 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. షెయ్ హోప్ 31 పరుగులు, ఓడెన్ స్మిత్ 24 పరుగులు చేశారు. జమైకా తలైవాస్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, క్రిస్ గ్రీన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ ఆమిర్, ఫాబియెన్ అలెన్, రోవ్‌మెన్ పావెలు తలా ఒక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment