Jamaica Tallawahs
-
టీమిండియాకు సిరీస్ దూరం చేసి.. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కింగ్
విండీస్ ఓపెనింగ్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభానికి ముందు టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఫామ్‌ను అందుకున్న కింగ్.. ఆ సిరీస్‌లో నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 85 పరుగులు (5 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి, తన జట్టు సిరీస్ కైవసం (3-2) చేసుకునేలా చేశాడు. తాజాగా సీపీఎల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్న కింగ్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి (81, 67), ఇక్కడ కూడా తన జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. Brandon King’s 22 ball FIFTY takes our Republic Bank play of the day! #CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/7TeGR8xevA — CPL T20 (@CPL) August 24, 2023 సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు సారధ్యం వహిస్తున్న కింగ్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌తో నిన్న (ఆగస్ట్ 23) జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసి, తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. జాషువ డిసిల్వ (36), డోమినిక్ డ్రేక్స్ (29 నాటౌట్), ఆండ్రీ ఫ్లెచర్ (23) ఓ మోస్తరు స్కోర్లు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. Super Salman 🇵🇰 Salman Irshad takes the wickets of Ambati Rayudu, Andre Fletcher and Corbin Bosch in the same over 🤯 #CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/eNS4sS2Kib — CPL T20 (@CPL) August 23, 2023 జాషువ, డ్రేక్స్, ఫ్లెచర్ మినహా మిగతా వారెవ్వరూ రాణించలేకపోయారు. కెప్టెన్ ఎవిన్ లెవిస్ 9 పరుగులు చేయగా, ఈ మ్యాచ్‌తో సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు డకౌటయ్యాడు. జమైకా బౌలర్లలో సల్మాన్ ఇర్షాద్ 4 వికెట్లతో విజృంభించగా.. మహ్మద్ అమిర్ 3 వికెట్లతో చెలరేగాడు. ఇమాద్ వసీం, నికోల్సన్ గోర్డన్ తలో వికెట్ దక్కించుకున్నారు. Tonight's @BetBarteronline magic moment sees @iamamirofficial in the wickets yet again! #CPL23 #SLKvBR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/NEX8k9HfN1 — CPL T20 (@CPL) August 24, 2023 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తల్లావాస్.. బ్రాండన్ కింగ్, షామారా బ్రూక్స్ (28 నాటౌట్), కిర్క్ మెకెన్జీ (23) రాణించడంతో 16.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సెయింట్ కిట్స్ బౌలర్లలో డ్రేక్స్, ఒషేన్ థామస్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్‌లో భారత్ నుంచి ఒక్క అంబటి రాయుడు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. A dominant 8-wicket win for the Tallawahs!!!🐊#CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/0O6sdesLty — CPL T20 (@CPL) August 24, 2023 Salman Irshad's T20 stock continues to rise 📈. He turns out a Man of the Match performance tonight 💫#CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #iflycaribbean pic.twitter.com/KDeYuIWtdi — CPL T20 (@CPL) August 24, 2023 -
టీమిండియాకు చుక్కలు చూపించాడు.. అక్కడ కూడా ఊచకోత!
కరేబియన్ లీగ్-2023 సీజన్‌ను జమైకా తల్లావాస్ విజయంతో ఆరంభించింది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో జమైకా విజయం సాధించింది. వెస్టిండీస్ స్టార్ ఆటగాడు, జమైకా తల్లావాస్ కెప్టెన్ బ్రాండన్ కింగ్ తన అద్భుతఫామ్ను కొనసాగిస్తున్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి టీ20లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్.. ఇప్పుడు సీపీఎల్ తొలి మ్యాచ్‌లో కూడా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కింగ్ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. కింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జమైకా తల్లావాస్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. సెయింట్ లూసియా బౌలర్లలో ఛేజ్ మూడు వికెట్లతో మెరిశాడు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగల్గింది. సెయింట్ లూసియా బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్(53), రోషన్ ప్రైమస్(37) పరుగులతో రాణించారు. జమైకా బౌలర్లలో ఇమాడ్ వసీం మూడు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, సల్మాన్ ఇర్షద్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: Asia Cup 2023: భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఫిక్స్.. రాహుల్ ఎంట్రీ! స్టార్ ఆటగాడు దూరం -
CPL 2022: ‘కింగ్’ అద్భుత ఇన్నింగ్స్.. మూడోసారి చాంపియన్‌గా జమైకా తలైవాస్
Caribbean Premier League 2022 - Barbados Royals vs Jamaica Tallawahs, Final: కరేబియన్ ప్రీమియర్ లీగ్- 2022 విజేతగా జమైకా తలైవాస్ అవతరించింది. గయానాలో బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. ఒబెడ్ మెకాయ్ బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్ సిక్సర్ బాది తలైవాస్ విజయం ఖరారు చేశాడు. CHAMPIONS!!!!! 🏆🏆🏆#CPL22 #BRvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #CPLFinal pic.twitter.com/DFMixoADQ0 — CPL T20 (@CPL) October 1, 2022 ఆజం ఖాన్ ఒక్కడే ఇక తాజా సీజన్లో విజయంతో జమైకా మూడోసారి ట్రోఫీ అందుకుంది. దీంతో రోవ్‌మన్ పావెల్ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. సీపీఎల్-2022 ఫైనల్లో టాస్ గెలిచిన బార్బడోస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్‌డౌన్ బ్యాటర్ ఆజం ఖాన్ అర్ధ శతకంతో రాణించగా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కింగ్ అదరగొట్టాడు లక్ష్య ఛేదనకు దిగిన జమైకా తలైవాస్‌కు ఓపెనర్ బ్రాండన్ కింగ్ అద్భుత ఆరంభం అందించాడు. 50 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ షామర్ బ్రూక్స్ 47 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 16.1 ఓవర్లలోనే తలైవాస్ జట్టు టార్గెట్ ఛేదించింది. రెండు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా మూడోసారి సీపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. బార్బడోస్‌ను కట్టడి చేయడంలో సఫలమైన తలైవాస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా అంతకుముందు 2013, 2016 సీజన్లలో తలైవాస్ టీమ్ సీపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. మాటల్లో వర్ణించలేను విజయానంతరం తలైవాస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ మాట్లాడుతూ.. ఈ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఒకానొక దశలో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తానే స్థితి నుంచి చాంపియన్లుగా అవతరించడం గొప్పగా అనిపిస్తోందన్నాడు. జట్టు సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందంటూ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. గయానాలో తమకు ప్రేక్షకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని.. ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. King produces a regal knock!!! He guides his team to win the tournament with an unbeaten 83 from 50 balls earning the CPL22 Final’s @Dream11 MVP award. #CPL22 #BRvJT #CricketPlayedLouder #Dream11 #BiggestPartyInSport pic.twitter.com/QPiuhDoj2F — CPL T20 (@CPL) October 1, 2022 -
CPL 2022: సెంచరీతో విండీస్ హిట్టర్ విధ్వంసం.. ఫైనల్లో జమైకా తలైవాస్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో జమైకా తలైవాస్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జమైకా తలైవాస్ 37 పరుగులతో విజయాన్ని అందుకుంది. విండీస్ హార్డ్ హిట్టర్ షమ్రా బ్రూక్స్ కీలక సమయంలో సెంచరీతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీస్కోరు చేసింది. షమ్రా బ్రూక్స్(52 బంతుల్లో 109 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. రోవ్‌మెన్ పావెల్ 23 బంతుల్లో 37 పరుగులు చేయగా.. చివర్లో ఇమాద్ వసీమ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గయానా వారియర్స్ బౌలర్లలో రొమెరియో షెపర్డ్ రెండు వికెట్లు తీయగా.. తాహిర్, ఓడియన్ స్మిత్‌లు చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసింది. కీమో పాల్ 56 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. షెయ్ హోప్ 31 పరుగులు, ఓడెన్ స్మిత్ 24 పరుగులు చేశారు. జమైకా తలైవాస్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, క్రిస్ గ్రీన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ ఆమిర్, ఫాబియెన్ అలెన్, రోవ్‌మెన్ పావెలు తలా ఒక వికెట్ తీశారు. -
సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో నికోలస్ పూరన్ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు. (39 బంతుల్లో 75 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లతో) రెచ్చిపోయిన పూరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గయానా అమెజాన్ వారియర్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. జమైకా తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవడంతో పాటు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక జమైకా తలైవాస్ వరుస ఓటములతో మరింత అట్టడుగుకు చేరింది. లీగ్‌లో నిలవాలంటే జమైకా అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్, చంద్రపాల్, హెట్‌మైర్, షోయబ్ మాలిక్‌లు మంచి ఆరంభాలే ఇచ్చినప్పటికీ పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. అయితే ఫామ్‌లో ఉన్న పూరన్ మాత్రం తన విధ్వంసాన్ని కొనసాగించాడు. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న తరహాలో పూరన్ ఇన్నింగ్స్ సాగింది. 18వ ఓవర్ వరకు సాదాసీదాగా ఉన్న వారియర్స్ స్కోరు పూరన్ ధాటికి చివరి రెండు ఓవర్లలో 30 పరుగులతో 160కి పైగా పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తైలవాస్ 19.1 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై 46 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. కిర్క్ మెకెంజీ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గయానా బౌలర్లలో ఓడియన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. చదవండి: CPL 2021: వసీమ్, రసెల్ ఆల్‌రౌండ్ మెరుపులు.. సెమీస్ ఆశలు సజీవం MASSIVE!!! Nicholas Pooran goes LARGE with the @OmegaXL hit from match 26, #CPL21 #JTvGAW #CricketPlayedLouder #OmegaXL pic.twitter.com/7fRnfIRBEA — CPL T20 (@CPL) September 11, 2021 -
రసెల్ ఆల్‌రౌండ్ మెరుపులు.. సెమీస్ ఆశలు సజీవం
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్( సీపీఎల్ 2021)లో భాగంగా గురువారం జమైకా తలైవాస్, సెంట్ లూసియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జమైకా తలైవాస్ ఘన విజయాన్ని అందుకుంది. రసెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచడంతో జమైకా తలైవాస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.. ఇక సెంట్ లూసియా వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కెన్నర్ లూయిస్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో పొలార్డ్(31,15 బంతులు; 4 సిక్సర్లు), ఇమాద్ వసీమ్(27, 10 బంతులు; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. సెంట్ లూసియా బౌలింగ్‌లో జెవర్ రాయల్, కదీమ్ అలీన్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ లూసియా 156 పరుగులకే ఆలౌట్ అయింది. మార్క్ డేయల్ 33, ఆండ్రీ ఫ్లెచర్ 30 పరుగులు చేశారు. ఇమాద్ వసీమ్ 3, రసెల్ 2, కార్లోస్ బ్రాత్‌వైట్ 2 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో తలైవాస్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా.. సెంట్ లూసియా కూడా 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4ఓటములతోనే ఉంది. అయితే నెట్ రన్‌రేట్ విషయంలో మైనస్‌లో ఉండడంతో నాలుగో స్థానంలో ఉంది. చదవండి: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు MVP!!! An all round performance with bat and ball sees Imad Wasim pick up the @Dream11 MVP for match 24. #CPL21 #SLKvJT #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/tFBWoJvGRu — CPL T20 (@CPL) September 10, 2021 -
శివాలెత్తిన రసెల్.. అతి భారీ స్కోర్ నమోదు చేసిన జమైకా తలైవాస్
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్(సీపీఎల్) 2021 సీజన్లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్(14 బంతులో 50; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను చితక్కొటి సీపీఎల్ చరిత్రలో తన జట్టు రెండో అతి భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రసెల్ విధ్వంసానికి తోడు చాడ్విక్ వాల్టన్(29 బంతులో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెన్నార్ లూయిస్(21 బంతులో 48; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), హైదర్ అలీ(32 బంతులో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోమన్ పావెల్(26 బంతులో 38; 3 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగి ఆడటంతో జమైకా తైలవాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జమైకా తైలవాస్ టాపార్డర్ ధాటికి ప్రత్యర్ధి బౌలర్లు వణిపోయారు. సెయింట్ లూసియా కింగ్స్ బౌలర్లలో ఓబెద్ మెక్ కాయ్ 3 వికెట్లు పడగొట్టగా, రోస్టన్ ఛేజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెయింట్ లూసియా జట్టు ఆరంభంలోనే తడబడింది. జమైకా బౌలర్ ప్రిటోరియస్(3/25) సెయింట్ లూసియా జట్టును దారుణంగా దెబ్బకొట్టాడు. అతనికి క్రిస్ గ్రీన్(1/22), ఆండ్రీ రసెల్(1/9) తోడవ్వడంతో 5 ఓవర్ల తర్వాత సెయింట్ లూసియా స్కోర్ 56/5. ఆ జట్టు గెలవాలంటే 90 బంతుల్లో 200 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: నీకంత సీన్ లేదంటూ ఆ ఇద్దరు ఆంటీలు నన్ను రెచ్చగొట్టేవారు.. -
ఆసిఫ్.. ఇంత కోపం పనికిరాదు
-
'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలివెళ్లు'
జమైకా : కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో(సీపీఎల్ 2020) బుధవారం జమైకా తలైవాస్, గుయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జమైకా జట్టు తరపున బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ 3 పరుగులకే ఔటయ్యాడు. కరీబియన్ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆసిఫ్ అలీ.. ఈ మ్యాచ్‌లోనూ బారీషాట్ ఆడబోయి డీప్ మిడ్-వికెట్ రీజియన్‌లో క్రిస్ గ్రీన్ అద్భుత డ్రైవ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే అప్పటికే పరుగు కోసం సగం క్రీజులోకి పరిగెత్తుకొచ్చిన ఆసిఫ్ అలీని ఉద్ధేశించి ఆసిఫ్..'నువ్వు ఔట్ అయ్యావు.. క్రీజు వదిలి వెళ్లు..' అంటూ కీమో పాల్ సైగ చేశాడు. అప్పటికే ఔట్ అయ్యాననే కోపంలో ఉన్న ఆసిఫ్ కీమో పాల్ వైపు బ్యాట్ ఎత్తాడు. అయితే ఆసిఫ్ బ్యాట్ నుంచి తృటిలో తప్పించుకున్న కీమో.. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే కీమో పాల్ కోపంతో ఆసిఫ్ వైపు తిరిగినా అప్పటికే అతను వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో జమైకా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఆసిఫ్ అలీకి చేసిన పనికి మాత్రం క్రమశిక్షణ చర్యల కింద జరిమానాతో విధించే అవకాశం ఉంది. చదవండి : కోహ్లి, రోహిత్‌ల ఆధిపత్యం మ్యాచ్‌లోనూ మాస్క్.. కీమో పాల్ వీడియో వైరల్ -
'ఆ మాటలు నా మనుసు నుంచి వచ్చాయి'
జమైకా : విండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ రామ్‌నరేశ్ శర్వాణ్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఫ్రాంచైజీ జమైకా తలవాస్ జట్టు నుంచి తనను తొలగించడానికి ఆ జట్టు కోచ్ రామ్ నరేశ్ శర్వాణ్ కారణమంటూ క్రిస్ గేల్ గతంలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆ జట్టు తనను కొనసాగించకపోవడానికి రామ్ నరేశ్ పాత్ర కీలకపాత్ర పోషించాడంటూ గేల్ మండిపడిన విషయం విధితమే. దీనిపై తాను మరోసారి మాట్లాడదలచుకున్నట్లు గేల్ పేర్కొన్నాడు. ('సందేహం లేదు.. జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్') 'జమైకా అభిమానులకు జమైకా తలవాస్ జట్టు గురించి వివరించడానికే ఆ వీడియో చేశాను. శర్వాణ్‌ను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. అయినా నేను ఇప్పటికీ అదే మాట మీద నిలబడుతున్నా. ఆరోజు నేను చేసిన వ్యాఖ్యలు నా మనుసులో నుంచే వచ్చాయి. నా సీపీఎల్ కెరీర్ ప్రయాణం జమైకా తలవాస్ జట్టుతో అద్భుతంగా సాగింది. ఎందుకంటే నా సొంత ప్రేక్షకుల మధ్య సబీనా పార్క్‌లో ఆడడం ఎప్పటికి మరిచిపోనూ. టి20 టోర్నమెంట్‌ను దెబ్బతీసే నా ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు. ఏడు సంవత్సరాల సీపీఎల్ కెరీర్లో ఇది నాకు వచ్చిన అవకాశంగానే భావిస్తున్నా తప్ప నా హక్కు అని మాత్రం అనుకోలేదంటూ' చెప్పుకొచ్చాడు. కాగా గేల్ శర్వాణ్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. 'శర్వాణ్... నువ్వు పాములాంటోడివి. ప్రతీకారం తీర్చుకునేందుకు విషం చిమ్ముతావు. వెన్నుపోటు పొడిచి చంపడానికి కూడా వెనుకాడవు. ఇప్పుడున్న కరోనా వైరస్ కంటే నీవే ప్రమాదకరం' అంటూ పేర్కొన్నాడు. -
గేల్.. ఇక నీ కామెంట్స్ చాలు..!
ఆంటిగ్వా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో జమైకా తలవాస్ జట్టు నుంచి తనను తొలగించడానికి ఆ జట్టు కోచ్ రామ్ నరేశ్ శర్వాణ్ కారణమంటూ క్రిస్ గేల్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆ జట్టు తనను కొనసాగించకపోవడానికి రామ్ నరేశ్ పాత్ర కీలకమని,అతను కరోనా కంటే ప్రమాదమని గేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. పాము కంటే శర్వాణ్ చాలా విషపూరితమన్నాడు. వెన్నుపొటు పొడవడంలో రామ్ నరేశ్ సిద్ధ హస్తుడని విమర్శించాడు. ఈ వాఖ్యలను జమైకా తలవాస్ ఖండించింది. ఇక గేల్ తన వ్యాఖ్యలకు ఫుల్స్టాప్ పెడితే మంచిదని హెచ్చరించింది. ఒక ఆటగాడ్ని రీటైన్ చేసుకోవాలా.. వద్దా అనే విషయంలో ఫ్రాంచైజీతో పాటు సెలక్షన్ కమిటీ పాత్ర కూడా ఉంటుందనే విషయాన్ని గేల్ గ్రహించాలని చురకలంటించింది. ఇక్కడ గేల్‌ను తప్పించడంలో రామ్ నరేశ్ శర్వాణ్ పాత్ర ఏమీలేదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటనలు చేసేముందు కాస్త సంయమనం పాటిస్తే మంచిదని గేల్‌కు హితబోధ చేసింది. ('ఇంత చెత్త ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు') ‘ గేల్ కాస్త తగ్గి మాట్లాడితే మంచిది. నిన్ను తీసివేయడానిక సవాలక్ష కారణాలున్నాయి. బహిరంగ విమర్శలు సరికాదు. నిన్నుతప్పించడంలో శర్వాణ్ పాత్ర ఏమీ లేదు. ఇక్కడ సెలక్షన్ కమిటీ ఉంది.. ఫ్రాంచైజీ కూడా ఉంది. నిన్నుఫ్రాంచైజీ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. దాంతో కొనసాగించలేదు. అంతే కానీ ఏ ఒక్కరూ నిన్ను తీసివేయడానికి కారణం కాదు’ అని తలవాస్ ఒక ప్రకటనలో పేర్కొంది.2019లో జమైకా తలవాస్ జట్టులోకి తిరిగి వచ్చిన గేల్.. అంతకుముందు 2013 నుంచి 2016 వరకూ ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది గేల్ తిరిగి జమైకాకు వచ్చిన క్రమంలో మూడేళ్ల పాటు కాంటాక్ట్ కుదుర్చుకున్నాడు. తన సీపీఎల్ కెరీర్‌ను హోమ్ టౌన్ ఫ్రాంచైజీతోనే ముగించాలనే ఉద్దేశంతోనే జమైకాకు ఆడుతున్నానని గేల్ తెలిపాడు. అయితే తాజా సీజన్లో గేల్‌ను జమైకా తలవాస్ వదిలేసుకుంది. అతన్ని తిరిగి రీటైన్ చేయలేదు.దాంతో సెయింట్ లూసియా జట్టుతో గేల్ ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది జమైకాకు తిరిగి వచ్చిన క్రమంలో గేల్ సెంచరీతో మెరిశాడు. కానీ తర్వాత విఫలమైన గేల్ పెద్దగా పరుగులు చేయలేదు. కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లో 243 పరుగులు చేయడంతో సదరు ఫ్రాంచైజీ గేల్‌తో ఉపయోగం లేదనుకునే అతన్ని విడిచిపెట్టింది. (రాస్ టేలర్‌కు ‘టాప్’ అవార్డు) -
'ఇంత చెత్త ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు'
జమైకా : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రాంచైజీపై అసహనం వ్యక్తం చేశాడు. రసెల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో జమైకా తలవాస్కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జమైకా తలవాస్ లాంటి విచిత్ర జట్టును మరొకటి చూడలేదంటూ రసెల్ పేర్కొన్నాడు. కాగా రెండు రోజుల క్రితమే ఇదే ఫ్రాంచైజీకి సహాయ కోచ్‌గా ఉన్న మాజీ విండీస్ ఆటగాడు రామ్‌నరేశ్ శర్వాణ్‌పై విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. శర్వాణ్ కరోనా మహమ్మారి కంటే చెత్త అని గేల్ విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో ఫ్రాంచైజీ తనను రీటెయిన్ చేసుకోకుండా వదిలించుకోవడానికి శర్వాణే కారణమని గేల్ ఆరోపించాడు. తాజాగా రసెల్ జమైకా తలవాస్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.(శర్వాణ్... నీవు కరోనా వైరస్ కంటే డేంజర్) 'నేను ప్రాతినిథ్యం వహించిన అన్ని జట్లలోకెల్లా జమైకా తలవాస్ విచిత్రమైనది. ఇది నిజంగా ఒక చెత్త ఫ్రాంచైజీ.. ఇలాంటి ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు. ఇది నేను ఊరికే చేస్తున్న ఆరోపణ కాదు. ఆ జట్టుతో కలిసి సుధీర్ఘంగా కొనసాగుతున్నా. అంతే కాదు ఒకప్పుడు లీడర్ టీమ్‌లో మెంబర్‌గానూ ఉన్నా. వారి ఆలోచనా ధోరణిని దగ్గరి నుంచి పరిశీలించా. ఆ జట్టు తరఫున ఆడటం కంటే ఊరుకోవడం ఉత్తమం. ఇప్పటికైనా యాజమాన్య తీరు మారకపోతే ఆ జట్టు మనుగడ కష్టమేనంటూ' రసెల్ పేర్కొన్నాడు. ('రసెల్‌తో ఆడితే అదే ఫీలింగ్ కలుగుతుంది') (షోయబ్ అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) -
సీపీల్ టైటిల్ గెలిచిన క్రిస్ గేల్ టీమ్
సెయింట్ కిట్స్: క్రిస్ గేల్ నాయకత్వంలోని జమైకా తల్వాస్ టీమ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2016 విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గయానా అమెజాన్ వారియర్స్ ను 9 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. కెప్టెన్ క్రిస్ తనదైన శైలిలో ఆడి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జమైకా టీమ్ 43 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 12.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 95 పరుగులు చేసింది. గేల్ 27 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 54 పరుగులు చేసి అవుటయ్యాడు. వాల్టన్(25), సంగక్కర(12) నాటౌట్ గా నిలిచారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన జమైకా 16.1 ఓవరల్లో 93 పరుగులకు ఆలౌటైంది. జమైకా బౌలర్లలో ఇమాద్ వసీం 3, షకీబ్ అల్ హసన్ 2, విలియమ్స్ 2 వికెట్లు పడగొట్టారు. రసెల్, థామస్ చెరో వికెట్ తీశారు. ఇమాద్ వసీం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. రసెల్ కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' దక్కింది. జమైకా తల్వాస్.. సీపీఎల్ దక్కించుకోవడం ఇది రెండోసారి.