జమైకా : విండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ రామ్‌నరేశ్ శర్వాణ్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఫ్రాంచైజీ జమైకా తలవాస్ జట్టు నుంచి తనను తొలగించడానికి ఆ జట్టు కోచ్ రామ్ నరేశ్ శర్వాణ్ కారణమంటూ క్రిస్ గేల్ గతంలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆ జట్టు తనను కొనసాగించకపోవడానికి రామ్ నరేశ్ పాత్ర కీలకపాత్ర పోషించాడంటూ గేల్ మండిపడిన విషయం విధితమే. దీనిపై తాను మరోసారి మాట్లాడదలచుకున్నట్లు గేల్ పేర్కొన్నాడు.
('సందేహం లేదు.. జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్')
'జమైకా అభిమానులకు జమైకా తలవాస్ జట్టు గురించి వివరించడానికే ఆ వీడియో చేశాను. శర్వాణ్‌ను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. అయినా నేను ఇప్పటికీ అదే మాట మీద నిలబడుతున్నా. ఆరోజు నేను చేసిన వ్యాఖ్యలు నా మనుసులో నుంచే వచ్చాయి. నా సీపీఎల్ కెరీర్ ప్రయాణం జమైకా తలవాస్ జట్టుతో అద్భుతంగా సాగింది. ఎందుకంటే నా సొంత ప్రేక్షకుల మధ్య సబీనా పార్క్‌లో ఆడడం ఎప్పటికి మరిచిపోనూ. టి20 టోర్నమెంట్‌ను దెబ్బతీసే నా ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు. ఏడు సంవత్సరాల సీపీఎల్ కెరీర్‌లో ఇది నాకు వచ్చిన అవకాశంగానే భావిస్తున్నా తప్ప నా హక్కు అని మాత్రం అనుకోలేదంటూ' చెప్పుకొచ్చాడు. కాగా గేల్ శర్వాణ్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. 'శర్వాణ్... నువ్వు పాములాంటోడివి. ప్రతీకారం తీర్చుకునేందుకు విషం చిమ్ముతావు. వెన్నుపోటు పొడిచి చంపడానికి కూడా వెనుకాడవు. ఇప్పుడున్న కరోనా వైరస్ కంటే నీవే ప్రమాదకరం' అంటూ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment