సీపీల్ టైటిల్ గెలిచిన క్రిస్ గేల్ టీమ్ | Tallawahs rout Warriors to claim second CPL title | Sakshi
Sakshi News home page

సీపీల్ టైటిల్ గెలిచిన క్రిస్ గేల్ టీమ్

Published Mon, Aug 8 2016 10:09 AM | Last Updated on Mon, Aug 13 2018 9:00 PM

సీపీల్ టైటిల్ గెలిచిన క్రిస్ గేల్ టీమ్ - Sakshi

సీపీల్ టైటిల్ గెలిచిన క్రిస్ గేల్ టీమ్

సెయింట్ కిట్స్: క్రిస్ గేల్ నాయకత్వంలోని జమైకా తల్వాస్ టీమ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2016 విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గయానా అమెజాన్ వారియర్స్ ను 9 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. కెప్టెన్ క్రిస్ తనదైన శైలిలో ఆడి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు.

94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జమైకా టీమ్ 43 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 12.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి 95 పరుగులు చేసింది. గేల్ 27 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 54 పరుగులు చేసి అవుటయ్యాడు. వాల్టన్(25), సంగక్కర(12) నాటౌట్ గా నిలిచారు.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన జమైకా 16.1 ఓవరల్లో 93 పరుగులకు ఆలౌటైంది. జమైకా బౌలర్లలో ఇమాద్ వసీం 3, షకీబ్ అల్ హసన్ 2, విలియమ్స్ 2 వికెట్లు పడగొట్టారు. రసెల్, థామస్ చెరో వికెట్ తీశారు. ఇమాద్ వసీం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. రసెల్ కు 'మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్' దక్కింది. జమైకా తల్వాస్.. సీపీఎల్ దక్కించుకోవడం ఇది రెండోసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement