కరేబియన్ లీగ్-2023 సీజన్‌ను జమైకా తల్లావాస్ విజయంతో ఆరంభించింది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో జమైకా విజయం సాధించింది. వెస్టిండీస్ స్టార్ ఆటగాడు, జమైకా తల్లావాస్ కెప్టెన్ బ్రాండన్ కింగ్ తన అద్భుతఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
భారత్‌తో జరిగిన ఆఖరి టీ20లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్.. ఇప్పుడు సీపీఎల్ తొలి మ్యాచ్‌లో కూడా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కింగ్ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. కింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జమైకా తల్లావాస్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది.
సెయింట్ లూసియా బౌలర్లలో ఛేజ్ మూడు వికెట్లతో మెరిశాడు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగల్గింది. సెయింట్ లూసియా బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్(53), రోషన్ ప్రైమస్(37) పరుగులతో రాణించారు. జమైకా బౌలర్లలో ఇమాడ్ వసీం మూడు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, సల్మాన్ ఇర్షద్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: Asia Cup 2023: భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఫిక్స్.. రాహుల్ ఎంట్రీ! స్టార్ ఆటగాడు దూరం
Comments
Please login to add a commentAdd a comment