
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ను ఫిలిప్స్ పెవిలియన్‌కు పంపాడు. అతడి క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు.
పాక్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన కివీ స్పీడ్ స్టార్ విలియం ఓ'రూర్క్ ఆఖరి బంతిని రిజ్వాన్‌కు కొంచెం వైడ్ బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. వెడ్త్ దొరకడంతో పాయింట్ దిశగా రిజ్వాన్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే కట్ షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి, పాయింట్‌లో ఉన్న ఫిలిప్స్ మాత్రం అద్బుతం చేశాడు.
ఫిలిప్స్ తన ఎడమవైపునకు డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో మహ్మద్ రిజ్వాన్(3) ఒక్కసారిగా బిత్తరపోయాడు. గ్లెన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. 73 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను లాథమ్, యంగ్ తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు.
విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేయగా.. లాథమ్ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫిలిప్స్ బ్యాట్‌తో సైతం సత్తాచాటాడు. 39 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తడబడుతోంది. 32 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.
చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment