
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను ఆతిథ్య పాకిస్తాన్ ఓటమితో ఆరంభించింది. కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 47 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది.
పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా(69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బాబర్ ఆజం(90 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 పరుగులు) సల్మాన్ అగా(42), పర్వాలేదన్పించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా.. విలియం ఓ రూర్క్, మాట్ హెన్రీ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్ చెరో వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(107), టామ్ లాథమ్(118) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. ఆఖరిలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు) మెరుపులు మెరిపించాడు.
ఇక పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది.
చదవండి: PAK vs NZ: వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్