
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కరాచీ వేదికగా పాకిస్తాన్(Pakistan)తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు.
73 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను లాథమ్, యంగ్ తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 114 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన ఈ కివీ ద్వయం.. క్రీజులో సెటిల్ అయ్యాక పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేయగా.. లాథమ్ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరిలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లు డెవాన్ కాన్వే(10), డార్లీ మిచెల్(10), విలియమ్సన్(1) విఫలమయ్యారు. ఇక పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు.
అఫ్రిదిని ఉతికారేశారు..
తన 10 ఓవర్ల కోటాలో అఫ్రిది 68 పరుగులిచ్చి వికెట్ ఏమీ సాధించలేకపోయాడు. గాయం నుంచి తిరిగి వచ్చాక అఫ్రిది తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడి బౌలింగ్‌లో పేస్ కూడా తగ్గింది. అంతేకాకుండా బంతిని స్వింగ్ చేయడంలో కూడా అఫ్రిది విఫలమవుతున్నాడు. మరోవైపు హ్యారీస్ రౌఫ్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు.
తుది జట్లు
పాకిస్తాన్
ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
న్యూజిలాండ్
డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ
చదవండి: PAK vs NZ: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే సూపర్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment