Will Young
-
Ind vs NZ: ‘రిజర్వ్’ నుంచి ‘హీరో’గా మారి... టీమిండియాపై గెలుపులో కీలకంగా
ముంబై: న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ 2020 డిసెంబర్లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు వరకు ఈ నాలుగేళ్లలో అతను 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. ప్రతీసారి రిజర్వ్ ఆటగాడిగానే ఎంపిక కావడం... విరామంలో సహచరులకు డ్రింక్స్ అందించడం మినహా అతనికి చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు! జట్టులో ఎవరైనా గాయపడితే తప్ప యంగ్ పేరును టీమ్ మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి. గాయం నుంచి కేన్ విలియమ్సన్ కోలుకోకపోవడంతో ముందుగా తొలి టెస్టులో చాన్స్ లభించింది. ఆ తర్వాత విలియమ్సన్ తర్వాతి మ్యాచ్‌లూ ఆడలేడని ఖాయం కావడంతో యంగ్ చోటుకు ఢోకా లేకుండా పోయింది. చివరకు సిరీస్‌లో మొత్తం 244 పరుగులు సాధించి కివీస్ చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. డ్రింక్స్ అందించడమే తనకు అలవాటుగా మారిపోయిందని... ఇప్పుడు టీమ్‌ను గెలిపించడం తనకు గర్వంగా అనిపిస్తోందని విల్ యంగ్ వ్యాఖ్యానించాడు. ‘నాలుగేళ్లలో వేర్వేరు కారణాలతో నేను మైదానంలో కంటే బయటే ఎక్కువగా ఉన్నాను. ఎప్పుడూ రిజర్వ్ బ్యాటర్‌గానే నా పేరు ఉండేది. జట్టు సభ్యులకు డ్రింక్స్ అందించడమే ఒక అనుభవంగా మారిపోయింది. అయితే ఎప్పుడు అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. విలియమ్సన్ స్థానంలో వచ్చి నా అతడిని అనుకరించకుండా నా సొంత ఆటనే ఆడాను. ఇప్పుడు నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది’ అని యంగ్ అన్నాడు. భారత్‌ను స్పిన్ పిచ్‌లపైనే చిత్తు చేయడం గొప్పగా అనిపించిందని యంగ్ చెప్పాడు. -
టీమిండియా స్పిన్నర్ల ప్రతాపం.. తొలిరోజే కివీస్ ఆలౌట్
న్యూజిలాండ్‌తో మూడో టెస్టును టీమిండియా మెరుగ్గా ఆరంభించింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలిరోజే కివీస్‌ను ఆలౌట్ చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. అయితే, బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. పుణె మ్యాచ్‌లోనూ ఘోర పరాభవం పాలైంది. కివీస్ చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయితద్వారా సొంతగడ్డపై పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సాఫీగా చేరాలన్నా.. వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకోవాలన్నా ఈ మ్యాచ్‌లో గెలవడం రోహిత్ సేనకు అత్యంత ముఖ్యం. లంచ్‌కు ముందు ఇలాఈ నేపథ్యంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటింగ్ మొదలుపెట్టిన కాసేపటికే ప్రమాదకర ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి పేసర్ ఆకాశ్ దీప్ శుభారంభం అందించగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్నాడు.జడేజా విశ్వరూపంలంచ్ బ్రేక్‌కు ముందు వీరిద్దరు కలిసి మూడు వికెట్లు తీయగా.. భోజన విరామం సమయం తర్వాత మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. విల్ యంగ్(71) రూపంలో తొలి వికెట్ దక్కించుకన్న జడ్డూ.. ఆ తర్వాత టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ల పనిపట్టాడు.Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 అదే విధంగా ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. వాషీ డారిల్ మిచెల్(82), అజాజ్ పటేల్(7)లను కూడా అవుట్ చేసి మొత్తంగా తన వికెట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) మినహా భారత స్పిన్నర్ల ప్రతాపం ముందు కివీస్ బ్యాటర్లంతా తలవంచారు. దీంతో 65.4 ఓవర్లలో న్యూజిలాండ్ 235 పరుగులు(తొలి ఇన్నింగ్స్) చేసి తొలిరోజే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడ్డూ ఐదు, వాషీ నాలుగు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.టీమిండియాకూ ఆదిలోనే ఎదురుదెబ్బఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దూకుడుగా ఆడిన రోహిత్ 18 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్.చదవండి: చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు -
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ సొంతం
నెల్సన్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. అతడితో పాటు ముష్పికర్ రహీం(45) పరుగులతో రాణించాడు. ఇక కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్సన్, ఆశోక్ చెరో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 23న నేపియర్ వేదికగా జరగనుంది. చదవండి: IPL Auction: విరాట్ కోహ్లికి రూ.42 కోట్లు.. టీమిండియా మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు -
న్యూజిలాండ్ ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాదేశ్ ఓటమి
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం డునెడిన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో 44 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. బంగ్లా కెప్టెన్ షాంటో టాస్ గెలచి తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే కివీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్లలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 30 ఓవర్లకు కుదించాడు. నిర్ణీత 30 ఓవర్లలో కివీస్ 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్(84 బంతుల్లో 105, 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ లాథమ్(92) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం రెండు, మెహది హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మిగితా నాలుగు వికెట్లు కూడా రనౌట్లే కావడం గమనార్హం. అనంతం డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 30 ఓవర్లలో 245 పరుగులగా నిర్ణయించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో అనముల్ హక్(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో సోధీ, మిల్నీ, క్లార్క్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: ENG vs WI: ఎస్ఆర్హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే -
కివీస్ గెలుపు జోరు...
ప్రపంచకప్‌లో మరో ఏకపక్ష విజయం... గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సమష్టి ప్రదర్శన ముందు అసోసియేట్ టీమ్ నెదర్లాండ్స్ నిలవలేకపోయింది... బ్యాటింగ్ పిచ్‌పై ముందుగా భారీ స్కోరు నమోదు చేసిన న్యూజిలాండ్ విసిరిన సవాల్‌కు పసికూన నెదర్లాండ్స్ వద్ద జవాబు లేకపోయింది... ఫలితంగా కివీస్ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా... హైదరాబాద్ వేదికగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ డచ్ బృందానికి ఓటమే ఎదురైంది. బ్యాటింగ్‌లో విల్ యంగ్, లాథమ్, రచిన్ రవీంద్ర, బౌలింగ్‌లో సాన్‌ట్నర్ న్యూజిలాండ్ విజయసారథులుగా నిలిచారు. సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ జట్టు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మళ్లీ సత్తా చాటింది. విడిగా చూస్తే విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రతీ ఒక్కరూ రాణించడంతో క్వాలిఫయర్ జట్టు నెదర్లాండ్స్‌పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (80 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్ లాథమ్ (46 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (51 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... డరైల్ మిచెల్ (47 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కొలిన్ అకెర్మన్ (73 బంతుల్లో 69; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ సాన్‌ట్నర్ (5/59) ఉప్పల్ స్టేడియంలో వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సమష్టి బ్యాటింగ్‌తో... ఆశ్చర్యకర రీతిలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ బాగా నెమ్మదిగా ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లూ ఒక్క పరుగు లేకుండా మెయిడిన్లుగా ముగియడం విశేషం. అయితే ఆ తర్వాత జట్టు ధాటిని పెంచింది. కాన్వే (40 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), యంగ్ చక్కటి బ్యాటింగ్‌తో తర్వాతి 7 ఓవర్లలో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు రాబట్టారు. ఈ జోడీ విడిపోయిన తర్వాత వచ్చిన రచిన్ తన ఫామ్‌ను కొనసాగించాడు. 59 బంతుల్లో యంగ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, రచిన్‌కు హాఫ్ సెంచరీ కోసం 50 బంతులే సరిపోయాయి. మరో ఎండ్‌లో మిచెల్ కూడా జోరు ప్రదర్శించాడు. కానీ ఈ దశలో డచ్ బౌలర్లు ప్రత్యర్థిని కొద్దిసేపు నిలువరించారు. 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. అయితే మరోవైపు లాథమ్ దూకుడు కివీస్ స్కోరును 300 వందలు దాటించింది. సాన్‌ట్నర్ (17 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో చివర్లో భారీ స్కోరు చేయడంలో న్యూజిలాండ్ సఫలమైంది. ఆఖరి 10 ఓవర్లలో 84 పరుగులు సాధించిన న్యూజిలాండ్ వీటిలో చివరి 3 ఓవర్లలోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు రాబట్టడం విశేషం. అకెర్మన్ మినహా... భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఏ దశలోనూ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ వేగంగా సాగలేదు. పాక్‌తో మ్యాచ్‌తో పోలిస్తే జట్టు బ్యాటింగ్ ఈ సారి పేలవంగా కనిపించింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్ (12), డౌడ్ (16) విఫలం కాగా, అకెర్మన్ ఒక్కడే పోరాడగలిగాడు. అకెర్మన్, తేజ నిడమనూరు (26 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మధ్య నమోదైన 50 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్‌లో పెద్దది. క్రీజ్‌లో నిలదొక్కుకొని చక్కటి షాట్లతో జోరుపెంచిన దశలో తేజ లేని రెండో పరుగు కోసం అనవసరంగా ప్రయత్నించాడు. అకెర్మన్తో సమన్వయ లోపంతో అతను రనౌటయ్యాడు. 55 బంతుల్లో అకెర్మన్ అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో స్కాట్ ఎడ్వర్డ్స్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), సైబ్రాండ్ (34 బంతుల్లో 29; 3 ఫోర్లు) కొంత వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. లక్ష్యానికి చాలా దూరంలో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) డి లీడ్ (బి) వాండర్ మెర్వ్ 32; యంగ్ (సి) డి లీడ్ (బి) మీకెరెన్ 70; రచిన్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాండర్ మెర్వ్ 51; మిచెల్ (బి) మీకెరెన్ 48; లాథమ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) దత్ 53; ఫిలిప్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 4; చాప్మన్ (సి) వాండర్ మెర్వ్ (బి) దత్ 5; సాన్‌ట్నర్ (నాటౌట్) 36; హెన్రీ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1–67, 2–144, 3–185, 4–238, 5–247, 6–254, 7–293. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–2–62–2, ర్యాన్ క్లీన్ 7–1–41–0, మీకెరెన్ 9–0–59–2, వాండర్ మెర్వ్ 9–0–56–2, అకెర్మన్ 4–0–28–0, డి లీడ్ 10–0–64–1, విక్రమ్‌జిత్ 1–0–9–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (బి) హెన్రీ 12; డౌడ్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 16; అకెర్మన్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 69; డి లీడ్ (సి) బౌల్ట్ (బి) రచిన్ 18; తేజ (రనౌట్) 21; ఎడ్వర్డ్స్ (సి అండ్ బి) సాన్‌ట్నర్ 30; సైబ్రాండ్ (సి) కాన్వే (బి) హెన్రీ 29; వాండర్‌మెర్వ్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 1; క్లీన్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 8; ఆర్యన్ దత్ (బి) హెన్రీ 11; మీకెరెన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–21, 2–43, 3–67, 4–117, 5–157, 6–174, 7–180, 8–198, 9–218, 10–223. బౌలింగ్: బౌల్ట్ 8–0–34–0, హెన్రీ 8.3–0–40–3, సాన్‌ట్నర్ 10–0–59–5, ఫెర్గూసన్ 8–0–32–0, రచిన్ రవీంద్ర 10–0–46–1, ఫిలిప్స్ 2–0–11–0. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి పాకిస్తాన్ X శ్రీలంక వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: ‘పసికూన’పై కివీస్ ప్రతాపం.. వరుసగా న్యూజిలాండ్ రెండో విజయం
ICC Cricket WC 2023- New Zealand vs Netherlands, 6th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. రెండో మ్యాచ్‌లో ‘పసికూన’ నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో మట్టికరిపించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. ముగ్గురు అర్ధ శతకాలతో రాణించి ఓపెనర్ విల్ యంగ్ 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 51, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో రాణించారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు విక్రంజిత్ సింగ్(12), మాక్స్ ఒడౌడ్(16) వికెట్లు కోల్పోయి డీలా పడినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ అకెర్మాన్ డచ్ శిబిరంలో ఆశలు రేపాడు. ఆశలు రేపాడు 69 పరుగులతో రాణించిన అతడు అవుట్ కావడంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. సాంట్నర్ దెబ్బకు డచ్ జట్టు పెవిలియన్‌కు క్యూ కట్టింది. దీంతో... 99 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐదు వికెట్లతో చెలరేగిన సాంట్నర్ స్పిన్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ సాంట్నర్ అత్యధికంగా ఐదు వికెట్లు కూల్చి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. పేసర్ మ్యాట్ హెన్రీకి మూడు, మరో లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక తెలుగు మూలాలున్న డచ్ బ్యాటర్ తేజ నిడమనూరు రనౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: WC 2023: తడబడి.. నిలబడిన టీమిండియాకు బిగ్ షాక్! పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc)