బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌.. సిరీస్‌ సొంతం | New Zealand beat Bangladesh by 7 wickets despite Soumya ton | Sakshi
Sakshi News home page

BAN vs NZ: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌.. సిరీస్‌ సొంతం

Published Wed, Dec 20 2023 1:53 PM | Last Updated on Wed, Dec 20 2023 2:50 PM

New Zealand beat Bangladesh by 7 wickets despite Soumya ton - Sakshi

నెల్సన్‌ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్‌ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో విల్‌ యంగ్‌(89), నికోల్స్‌(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు.

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్‌.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం విశేషం. అతడితో పాటు ముష్పికర్‌ రహీం(45) పరుగులతో రాణించాడు.

ఇక కివీస్‌ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్‌సన్‌, ఆశోక్‌ చెరో వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్‌ 23న నేపియర్‌ వేదికగా జరగనుంది.
చదవండిIPL Auction: విరాట్‌ కోహ్లికి రూ.42 కోట్లు.. టీమిండియా మాజీ ఓపెనర్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement