Sowmya Sarkar
-
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ సొంతం
నెల్సన్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. అతడితో పాటు ముష్పికర్ రహీం(45) పరుగులతో రాణించాడు. ఇక కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్సన్, ఆశోక్ చెరో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 23న నేపియర్ వేదికగా జరగనుంది. చదవండి: IPL Auction: విరాట్ కోహ్లికి రూ.42 కోట్లు.. టీమిండియా మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు -
బంగ్లాదేశ్ క్రికెటర్లకు వాంతులు!
న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం టీమిండియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్‌లో ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇబ్బంది పడినట్టు వెల్లడైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన బంగ్లా సీనియర్ బ్యాట్స్‌మన్ సౌమ్య సర్కార్, మరో ఆటగాడు వాంతులు చేసుకున్నట్టు ‘ఈఎస్పీఎన్’ వెల్లడించింది. ఆందోళనలు పట్టించుకోకుండా ఢిల్లీలో మ్యాచ్ నిర్వహించడంతో బీసీసీఐపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరినప్పటికీ బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో రద్దు చేయడం కుదరదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చిచెప్పారు. కాలుష్యాన్ని లెక్కచేయకుండా క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన రెండు జట్లను మ్యాచ్ ముగిసిన తర్వాత ట్విటర్ ద్వారా ఆయన అభినందించారు. అయితే ఢిల్లీ కాలుష్యం తనను ఇబ్బంది పెట్టలేదని కీలక ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీం తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈ వాయు కాలుష్యం నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. నేను ఎవరి బౌలింగ్‌లో ఆడుతున్నా అనే దానిపైనే దృష్టి పెట్టాను. అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి మేము ఇక్కడకు వచ్చాం కాబట్టి మిగతా విషయాలను పట్టించుకోమ’ని అతడు పేర్కొన్నాడు. భారత్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. (చదవండి: అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్) -
రెండు మ్యాచ్‌లూ రద్దు
ధర్మశాల: భారీ వర్షం కారణంగా టి20 ప్రపంచకప్‌లో శుక్రవారం జరగాల్సిన రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లూ రద్దయ్యాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఒమన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత వర్షం రావడంతో మైదానం చిత్తడిగా మారడంతో ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామంతో నెదర్లాండ్స్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైంది. మరోవైపు బంగ్లాదేశ్, ఐర్లాండ్ల మధ్య మ్యాచ్ ఆలస్యంగా మొదలైనా.. మధ్యలో వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 8 ఓవర్లలో 2 వికెట్లకు 94 పరుగులు చేసింది. తమీమ్ (47), సౌమ్య సర్కార్ (20), షబ్బీర్ రెహమాన్ (13 నాటౌట్) రాణించారు. ఈ దశలో భారీ వర్షం రావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. శనివారం జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ల్లో జింబాబ్వేతో అఫ్ఘానిస్తాన్; హాంకాంగ్‌తో స్కాట్లాండ్ తలపడతాయి.