![Black Caps beat Bangladesh by 44 runs in ODI series opener - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/17/Newzealand.jpg.webp?itok=ZL9l9M3G)
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం డునెడిన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో 44 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. బంగ్లా కెప్టెన్ షాంటో టాస్ గెలచి తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్ ఆహ్హనించాడు.
అయితే కివీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్లలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 30 ఓవర్లకు కుదించాడు. నిర్ణీత 30 ఓవర్లలో కివీస్ 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్(84 బంతుల్లో 105, 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ లాథమ్(92) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
బంగ్లా బౌలర్లలో షోర్‌ఫుల్ ఇస్లాం రెండు, మెహది హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మిగితా నాలుగు వికెట్లు కూడా రనౌట్‌లే కావడం గమనార్హం. అనంతం డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 30 ఓవర్లలో 245 పరుగులగా నిర్ణయించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో అనముల్ హక్(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో సోధీ, మిల్నీ, క్లార్క్‌సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: ENG vs WI: ఎస్‌ఆర్‌హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే
Comments
Please login to add a commentAdd a comment