కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా ఇమ్రాన్ తహీర్ సారథ్యంలోని గయానా అమెజాన్ వారియర్స్ నిలిచింది. సోమవారం గయానా వేదికగా జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన అమెజాన్ వారియర్స్.. తొలిసారి సీపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్.. గయనా బౌలర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది.
గయనా బౌలర్లలో ప్రోటీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ 4 వికెట్లతో నైట్ రైడర్స్‌ను దెబ్బతీయగా.. మోతీ, తహీర్ తలా రెండు వికెట్లు సాధించారు. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో కార్టీ(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయయ్యారు. 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
గయానా బ్యాటర్లలో ఓపెనర్ అయాబ్(52),హోప్(32) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా డ్వైన్ ప్రిటోరియస్ నిలవగా.. షాయ్ హోప్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు వరించింది.
చదవండి: KL Rahul: నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది
Comments
Please login to add a commentAdd a comment