సెంట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో బుధవారం గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. లీగ్‌లో తొలిసారి సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో గయానా వారియర్స్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఉడాన 21, నరైన్ 21 పరుగులు చేశారు. రొమారియె షెఫర్డ్ , మహ్మద్ హఫీజ్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది. హెట్‌మైర్ , నికోలస్ పూరన్‌లు 27 పరుగులు చేశారు.
చదవండి: పొట్టి క్రికెట్‌లో అరుదైన మైలురాయిని దాటేసిన విండీస్ యోధుడు
మ్యాచ్‌లో ఫలితం రాకపోవడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేసింది. ఇక ట్రిన్‌బాగో సులువుగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే షెఫర్డ్ తన బౌలింగ్ మ్యాజిక్‌ను చూపించాడు. షెఫర్డ్ వేసిన తొలి బంతికే పొలార్డ్ ఔట్ కావడంతో విజయానికి ఐదు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సి ఉంది. రెండో బంతికి సింగిల్ రాగా.. మూడు బంతికి పరుగు రాలేదు. ఇక నాలుగో బంతికి రెండు పరుగులు రాగా.. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు కావాలి. ఐదో బంతికి పరుగు రాకపోవడం.. ఆరో బంతికి సింగిల్ రావడంతో ట్రిన్‌బాగో నాలుగు పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ విజయంతో గయానా వారియర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. మ్యాచ్‌లో ఓడినప్పటికీ ట్రిన్‌బాగో మూడో స్థానంలోనే కొనసాగుతుంది.
చదవండి: వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి..
Comments
Please login to add a commentAdd a comment