కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్.. బేబీ ఏబీ అని పిలుచుకున్న డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే అవకాశం కొద్దిలో మిస్ అయింది. అయినప్పటికి వరుసగా ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన బ్రెవిస్ 30 పరుగులు పిండుకున్నాడు. సీపీఎల్‌లో డెవాల్డ్ బ్రెవిస్ సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
గురువారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెవిస్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అకిల్ హొసెన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని మిస్ చేసిన బ్రెవిస్.. ఆ తర్వాత వరుస మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఓవర్ పూర్తయింది. 20వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన డారిన్ దుపావిల్లన్ బౌలింగ్‌లో చివరి రెండు బంతులు ఆడిన బ్రెవిస్ రెండు సిక్సర్లు బాదాడు. అలా తాను ఎదుర్కొన్న వరుస ఐదు బంతులను సిక్సర్లుగా మలిచినప్పటికి... ఓవర్లు అయిపోవడంతో తృటిలో ఆరు సిక్సర్ల రికార్డు మిస్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్‌లో సెంట్ కిట్స్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ 7 పరుగులుతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డెవాల్డ్ బ్రెవిస్ 30 నాటౌట్, బ్రావో 23 పరుగులు చేశాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Dewald Brevis 5 sixes in a row
— ° (@anubhav__tweets) September 22, 2022
30*(6) 🔥🔥🔥 pic.twitter.com/faGyEvD84z
చదవండి: ఆ ఒక్క సిక్స్‌తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు
డుప్లెసిస్ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్‌లో నాలుగోది! కానీ పాపం..
Comments
Please login to add a commentAdd a comment