St Kitts & Nevis Patriots
-
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు శుభారంభం.. రసవత్తరంగా సాగిన తొలి మ్యాచ్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌కు శుభారంభం లభించింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ చివరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. ఈమ్యాచ్‌లో ఫాల్కన్స్‌పై పేట్రియాట్స్ వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో గెలుపుకు ఏడు పరుగులు అవసరం కాగా.. పేట్రియాట్స్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అన్రిచ్ నోర్జే చివరి బంతికి సింగిల్ తీసి పేట్రియాట్స్ను గెలిపించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. జువెల్ ఆండ్రూ (50 నాటౌట్), ఫఖర్ జమాన్ (43) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కోఫి జేమ్స్ 22, ఫేబియన్ అలెన్ 24 (నాటౌట్), బిల్లింగ్స్ 18 పరుగులు చేశారు. పేట్రియాట్స్ బౌలర్లలో నోర్జే, డొమినిక్ డ్రేక్స్, అష్మెద్ నెడ్, షంషి తలో వికెట్ పడగొట్టారు.164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పేట్రియాట్స్.. 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఎవిన్ లెవిస్ (29), ఆండ్రీ ఫ్లెచర్ (25), కైల్ మేయర్స్ (39), ఓడియన్ స్మిత్ (27), డొమినిక్ డ్రేక్స్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. షమార్ స్ప్రింగర్ నాలుగు వికెట్లు తీసి పేట్రియాట్స్ను భయపెట్టాడు. రోషన్ ప్రైమస్ 2, మొహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం తలో వికెట్ పడగొట్టారు. రేపటి మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. -
టీమిండియాకు సిరీస్ దూరం చేసి.. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కింగ్
విండీస్ ఓపెనింగ్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభానికి ముందు టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఫామ్‌ను అందుకున్న కింగ్.. ఆ సిరీస్‌లో నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 85 పరుగులు (5 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి, తన జట్టు సిరీస్ కైవసం (3-2) చేసుకునేలా చేశాడు. తాజాగా సీపీఎల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్న కింగ్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి (81, 67), ఇక్కడ కూడా తన జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. Brandon King’s 22 ball FIFTY takes our Republic Bank play of the day! #CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/7TeGR8xevA — CPL T20 (@CPL) August 24, 2023 సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు సారధ్యం వహిస్తున్న కింగ్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌తో నిన్న (ఆగస్ట్ 23) జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసి, తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. జాషువ డిసిల్వ (36), డోమినిక్ డ్రేక్స్ (29 నాటౌట్), ఆండ్రీ ఫ్లెచర్ (23) ఓ మోస్తరు స్కోర్లు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. Super Salman 🇵🇰 Salman Irshad takes the wickets of Ambati Rayudu, Andre Fletcher and Corbin Bosch in the same over 🤯 #CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/eNS4sS2Kib — CPL T20 (@CPL) August 23, 2023 జాషువ, డ్రేక్స్, ఫ్లెచర్ మినహా మిగతా వారెవ్వరూ రాణించలేకపోయారు. కెప్టెన్ ఎవిన్ లెవిస్ 9 పరుగులు చేయగా, ఈ మ్యాచ్‌తో సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు డకౌటయ్యాడు. జమైకా బౌలర్లలో సల్మాన్ ఇర్షాద్ 4 వికెట్లతో విజృంభించగా.. మహ్మద్ అమిర్ 3 వికెట్లతో చెలరేగాడు. ఇమాద్ వసీం, నికోల్సన్ గోర్డన్ తలో వికెట్ దక్కించుకున్నారు. Tonight's @BetBarteronline magic moment sees @iamamirofficial in the wickets yet again! #CPL23 #SLKvBR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/NEX8k9HfN1 — CPL T20 (@CPL) August 24, 2023 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తల్లావాస్.. బ్రాండన్ కింగ్, షామారా బ్రూక్స్ (28 నాటౌట్), కిర్క్ మెకెన్జీ (23) రాణించడంతో 16.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సెయింట్ కిట్స్ బౌలర్లలో డ్రేక్స్, ఒషేన్ థామస్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్‌లో భారత్ నుంచి ఒక్క అంబటి రాయుడు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. A dominant 8-wicket win for the Tallawahs!!!🐊#CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/0O6sdesLty — CPL T20 (@CPL) August 24, 2023 Salman Irshad's T20 stock continues to rise 📈. He turns out a Man of the Match performance tonight 💫#CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #iflycaribbean pic.twitter.com/KDeYuIWtdi — CPL T20 (@CPL) August 24, 2023 -
'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా!
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్.. బేబీ ఏబీ అని పిలుచుకున్న డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టే అవకాశం కొద్దిలో మిస్ అయింది. అయినప్పటికి వరుసగా ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన బ్రెవిస్ 30 పరుగులు పిండుకున్నాడు. సీపీఎల్‌లో డెవాల్డ్ బ్రెవిస్ సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గురువారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెవిస్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అకిల్ హొసెన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని మిస్ చేసిన బ్రెవిస్.. ఆ తర్వాత వరుస మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఓవర్ పూర్తయింది. 20వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన డారిన్ దుపావిల్లన్ బౌలింగ్‌లో చివరి రెండు బంతులు ఆడిన బ్రెవిస్ రెండు సిక్సర్లు బాదాడు. అలా తాను ఎదుర్కొన్న వరుస ఐదు బంతులను సిక్సర్లుగా మలిచినప్పటికి... ఓవర్లు అయిపోవడంతో తృటిలో ఆరు సిక్సర్ల రికార్డు మిస్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో సెంట్ కిట్స్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ 7 పరుగులుతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డెవాల్డ్ బ్రెవిస్ 30 నాటౌట్, బ్రావో 23 పరుగులు చేశాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. Dewald Brevis 5 sixes in a row 30*(6) 🔥🔥🔥 pic.twitter.com/faGyEvD84z — ° (@anubhav__tweets) September 22, 2022 చదవండి: ఆ ఒక్క సిక్స్‌తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు డుప్లెసిస్ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్లో నాలుగోది! కానీ పాపం.. -
టీ20ల చరిత్రలో అరుదైన ఘనత.. ఆ జాబితాలో ఇద్దరూ విండీస్ యోధులే
సెయింట్ కిట్స్: పొట్టి క్రికెట్లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 500 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బుధవారం జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్-2021)లో ఫైనల్ మ్యాచ్ ఆడడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా 500 టీ20లు ఆడిన బ్రావో.. 6,566 పరుగులు సాధించడంతో పాటు 540 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ జాబితాలో విండీస్‌కే చెందిన మరో ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పొలార్డ్ 561 మ్యాచ్‌ల్లో 11,159 పరుగులు చేయడంతో పాటు 298 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే, సీపీఎల్‌లో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రావో సారథ్యంలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సెయింట్ లూసియా కింగ్స్‌పై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రకీమ్ కార్న్‌వాల్(32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్(40 బంతుల్లో 43; ఫోర్లు, 2 సిక్సర్లు), కీమో పాల్(21 బంతుల్లో 39; 5 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో సెయింట్ కిట్స్ ఆటగాడు డొమినిక్ బ్రేక్స్(24 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. చదవండి: 'ఆ ఒక్కటి' మినహా.. ధోనితో పోలిస్తే కోహ్లినే బెటర్..! -
డుప్లెసిస్ ఊచకోత.. 51 బంతుల్లోనే శతక్కొట్టుడు..
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్ 2021లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ ఓపెనర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఉగ్రరూపం దాల్చాచాడు. 51 బంతుల్లోనే శతక్కొట్టి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్.. 60 బంతుల్లో 13 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో రోస్టన్ ఛేజ్(31 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సెయింట్ లూసియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. 100 for @faf1307 but the skippa still thinks there is work to be done‼️ #SLKvSKNP #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/cqPzGFnTAg — CPL T20 (@CPL) September 4, 2021 అనంతరం ఛేదనలో సెయింట్ కిట్స్ 16.5 ఓవర్లలో కేవలం 124 పరుగులు మాత్రమే చేసి చాప చాట్టేయడంతో ప్రత్యర్ధి 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ ఎంచుకున్న విధ్వంసకర వీరుడు ఎవిన్ లూయిస్(42 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటిరి పోరాటం చేశాడు.సెయింట్ లూసియా బౌలర్లు అల్జరీ జోసఫ్(3/27), కీమో పాల్(3/23) ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా, వాహబ్ రియాజ్, రోస్టన్ ఛేజ్, కెస్రిక్ విలియమ్స్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే డుప్లెసిస్.. శతక్కొట్టడంతో సీఎస్కే ఆభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సెప్టెంబర్ 19 నుంచి మొదలయ్యే ఐపీఎల్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌ల్లో కూడా డుప్లెసిస్ ఇదే తరహాలో రాణించాలని ఆశిస్తున్నారు. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న జరిగే మ్యాచ్‌లో సీఎస్కే.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. చదవండి: గాయం వేధిస్తున్నా పెయిన్ కిల్లర్ తీసుకుని మరీ ఆడాడు.. -
ఏబీ దూకుడు
బార్బాడాస్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో బార్బాడాస్ ట్రిడెంట్స్ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అదరగొట్టాడు. బుధవారం రాత్రి సెయింట్ కిట్స్-నేవిస్ పాట్రోయిట్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో డివిలియర్స్ దూకుడుగా ఆడి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. డివిలియర్స్(82; 54 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో బార్బాడాస్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన సెయింట్ కిట్స్ తొలుత బార్బాడాస్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బార్బాడాస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు స్టీవ్ టేలర్(2), రీఫర్(1)లు నిరాశపరిచారు. ఆ తరుణంలో షోయబ్ మాలిక్(16)తో జతకలిసిన డివిలియర్స్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా డివీ మాత్రం దూకుడును కొనసాగించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఏబీ.. ఆపై మరింత దాటిగా ఆడాడు. అయితే శతకానికి 18 పరుగుల దూరంలో కొట్రెల్ వేసిన స్లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన డివీ ఆరో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. బార్బాడాస్ మిగతా ఆటగాళ్లలో పూరాంట్(38), పొలార్డ్(27)లు ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన సెయింట్ కిట్స్-నేవిస్ పాట్రోయిట్స్ 20.0 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.సెయింట్ కిట్స్ జట్టులో డు ప్లెసిస్(42), కార్టర్(46) రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఈ టోర్నీలో బార్బాడాస్ కు ఇది రెండో విజయం కాగా,సెయింట్ కిట్స్ ఇప్పటివరకూ ఒక గెలుపును మాత్రమే నమోదు చేసింది.