
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌కు శుభారంభం లభించింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ చివరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. ఈమ్యాచ్‌లో ఫాల్కన్స్‌పై పేట్రియాట్స్ వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో గెలుపుకు ఏడు పరుగులు అవసరం కాగా.. పేట్రియాట్స్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అన్రిచ్ నోర్జే చివరి బంతికి సింగిల్ తీసి పేట్రియాట్స్‌ను గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. జువెల్ ఆండ్రూ (50 నాటౌట్), ఫఖర్ జమాన్ (43) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కోఫి జేమ్స్ 22, ఫేబియన్ అలెన్ 24 (నాటౌట్), బిల్లింగ్స్ 18 పరుగులు చేశారు. పేట్రియాట్స్ బౌలర్లలో నోర్జే, డొమినిక్ డ్రేక్స్, అష్మెద్ నెడ్, షంషి తలో వికెట్ పడగొట్టారు.
164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పేట్రియాట్స్.. 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఎవిన్ లెవిస్ (29), ఆండ్రీ ఫ్లెచర్ (25), కైల్ మేయర్స్ (39), ఓడియన్ స్మిత్ (27), డొమినిక్ డ్రేక్స్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. షమార్ స్ప్రింగర్ నాలుగు వికెట్లు తీసి పేట్రియాట్స్‌ను భయపెట్టాడు. రోషన్ ప్రైమస్ 2, మొహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం తలో వికెట్ పడగొట్టారు. రేపటి మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment