
సెంట్‌కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో ఎవిన్ లూయిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ఆద్యంతం సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం సృష్టించిన లూయిస్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. 52 బంతుల్లో 102 పరుగులు చేసిన లూయిస్ ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ విజయంతో సెంట్ కిట్స్ పాయింట్ల పట్టికలో టాప్ స్థానానికి చేరుకొని ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది.
చదవండి: Nicholas Pooran: సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖర్లో సునీల్ నరైన్( 18 బంతుల్లో 33, 4 సిక్సర్లు, ఒక ఫోర్) ఆకట్టుకున్నాడు. సెంట్ కిట్స్ బౌలర్లలో డొమినిక్ డ్రేక్స్ , జాన్ జాగేసర్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ కిట్స్‌కు ఓపెనర్లు గేల్, లూయిస్‌లు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా గేల్ ఉన్నంతసేపు దడదడలాడించాడు. 18 బంతుల్లో 35 పరుగులు చేసిన గేల్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, సిక్సర్ ఉన్నాయి. గేల్ ఔటైన తర్వాత బాధ్యతను ఎత్తుకున్న లూయిస్ మిగతా పనిని పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన లూయిస్ మ్యాచ్‌ను గెలిపించాడు.
చదవండి: IPL 2021: బెయిర్ స్టో స్థానంలో విండీస్ స్టార్ ఆటగాడు
Evin Lewis 💯 This #IPL gonna be good! @rajasthanroyals 🔥🔥 #RR pic.twitter.com/kumGve2Hrc
— Frank (@franklinnnmj) September 12, 2021