Evin Lewis
-
విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇంగ్లిష్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. కాగా స్వదేశంలో విండీస్.. బట్లర్ బృందంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.ఇప్పటికే సిరీస్ ఇంగ్లండ్ కైవసంఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సెయింట్ లూయీస్ వేదికగా ఆదివారం తెల్లవారుజామున నాలుగో టీ20 జరిగింది. డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. సాల్ట్ 35 బంతుల్లోనే 55 (5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాక్స్ 12 బంతుల్లోనే 25 (ఒక ఫోర్ 2 సిక్సర్లు) పరుగులు చేశారు. మిగతా వాళ్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (23 బంతుల్లో 38) రాణించగా.. జాకోబ్ బెతెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఇంగ్లండ్ భారీ స్కోరుమొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న బెతెల్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో సామ్ కర్రాన్ ధనాధన్ ఇన్నింగ్స్(13 బంతుల్లో 24)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ రెండు, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ ఓపెనర్ల ఊచకోత.. విండీస్ ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆది నుంచే దుమ్ములేపింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, షాయీ హోప్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పరుగుల విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ లూయీస్ సిక్సర్ల వర్షం కురిపించగా.. హోప్ బౌండరీలతో పరుగులు రాబట్టాడు.Smashed💥...platform set for the #MenInMaroon#TheRivalry | #WIvENG pic.twitter.com/KHgwBGcYbJ— Windies Cricket (@windiescricket) November 16, 2024 మెరుపు అర్ధ శతకాలులూయీస్ మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేయగా... హోప్ 24 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 రన్స్ స్కోరు చేశాడు. వీరిద్దరి మెరుపు అర్ధ శతకాలకు తోడు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(23 బంతుల్లో 38), షెర్ఫానే రూథర్‌ఫర్డ్(17 బంతుల్లో 29 నాటౌట్)కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు.How good was @shaidhope tonight?🏏🌟#TheRivalry | #WIvENG pic.twitter.com/MkfP5wE7U7— Windies Cricket (@windiescricket) November 16, 2024 19 ఓవర్లలోనేఫలితంగా 19 ఓవర్లలోనే వెస్టిండీస్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు, జాన్ టర్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనాధన్ హాఫ్ సెంచరీతో అలరించిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వన్డే సిరీస్ విండీస్దేకాగా తొలుత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువజామున(ఉదయం 1.20 నిమిషాలకు) ఐదో టీ20 జరుగనుంది.చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్.. తొలి వన్డేలో విండీస్ విజయం
ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 45.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుడకేశ్ మోటీ (4/41) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ కర్రన్ 37, జాకబ్ బేతెల్ 27, జోర్డన్ కాక్స్ 17, ఫిలిప్ సాల్ట్ 18, విల్ జాక్స్ 19, ఆదిల్ రషీద్ 15, డాన్ మౌస్లీ 8, జేమీ ఓవర్టన్ 0, జోఫ్రా ఆర్చర్ 7 పరుగులు చేశారు.అనంతరం వెస్టిండీస్ స్వల్ప లక్ష్య ఛేదనకు దిగగా వర్షం పలు మార్లు అంతరాయం కలిగించింది. విండీస్ స్కోర్ 157/2 (25.5 ఓవర్లు) వద్ద నుండగా మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన విండీస్‌ను విజేతగా ప్రకటించారు.విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ ఎవిన్ లెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడా పెడా బౌండరీలు, సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు. 69 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో బ్రాండన్ కింగ్ 30, కీసీ కార్టీ 19, షాయ్ హోప్ 6 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మూడు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి విండీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆంటిగ్వా వేదికగా నవంబర్ 2న జరుగనుంది.చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..! -
మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ..! కట్ చేస్తే.. విధ్వంసకర సెంచరీ
పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలో 8 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్డిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే శ్రీలంక స్కోర్ 17.2 ఓవర్లలో 81-1 వద్ద వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.ఆ తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత మ్యాచ్ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్‌కు 23 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(22 బంతుల్లో 56, 9 ఫోర్లు, ఒక సిక్సర్), నిస్సాంక(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు.అనంతరం డక్‌వర్త్‌లూయిస్ పద్దతి ప్రకారం విండీస్ టార్గెట్‌ను 23 ఓవర్లలో 195 పరుగులగా నిర్ణయించారు. ఈ భారీ లక్ష్యాన్ని విండీస్ సునాయసంగా ఛేదించేసింది. 22 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కరేబియన్లు ఊదిపడేశారు.లూయిస్ విధ్వంసకర సెంచరీ..కాగా మూడేళ్ల తర్వాత విండీస్ వన్డే జట్టులోకి వచ్చిన ఓపెనర్ ఎవిన్ లూయిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో లూయిస్ 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు సర్ఫెన్ రూథర్ ఫర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ ఓటమితో విండీస్ వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. అదేవిధంగా తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన శ్రీలంక 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. Back like he never left! 💪🏻 In an emphatic win for the West Indies, Evin Lewis smashed an unbeaten 102 off 61 balls against Sri Lanka in his first ODI since 2021! 😍#SLvWIonFanCode pic.twitter.com/0nr2rTs01j— FanCode (@FanCode) October 27, 2024 -
ఎవిన్ లూయిస్ విధ్వంసకర శతకం
కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో తొలి శతకం నమోదైంది. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఆటగాడు ఎవిన్ లూయిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో లూయిస్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో కైల్ మేయర్స్ కూడా శతకానికి చేరువగా వచ్చి ఔటయ్యాడు. మేయర్స్ 62 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. భానుక రాజపక్స (35 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (27 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పేట్రేగిపోవడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఆఖర్లో డేవిడ్ వీస్ (20 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించాడు. పేట్రియాట్స్ బౌలర్లలో కైల్ మేయర్స్, అన్రిచ్ నోర్జే తలో రెండు వికెట్లు, ఓడియన్ స్మిత్ ఓ వికెట్ పడగొట్టారు. ఎవిన్ లూయిస్ సెంచరీతో చెలరేగినా పేట్రియాట్స్ ఓడిపోవడం గమనార్హం. -
202 పరుగుల టార్గెట్... 24 రన్స్‌కే 4 వికెట్లు! కట్ చేస్తే సంచలన విజయం
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెయింట్ లూసియా కింగ్స్ శుభారంభం చేసింది. ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా ఘన విజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో లూసియా కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది.అయితే లక్ష్య చేధనలో సెయింట్ లూసియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో లూసియా బ్యాటర్లు టిమ్ సీఫెర్ట్ , భానుక రాజపక్స అద్భుతం చేశారు. వీరిద్దరూ సెయింట్ కిట్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.సిక్సర్ల వర్షం కురిపిస్తూ తమ జట్టును లక్ష్యం వైపు తీసుకువెళ్లారు. సీఫెర్ట్(27 బంతుల్లో 64, 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఔటైనప్పటకి రాజపక్స(67 నాటౌట్) మాత్రం తన దూకుడును కొనసాగించాడు. వీరిద్దరితో పాటు డేవిడ్ వీస్(20 బంతుల్లో 34) తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఫలితంగా భారీ లక్ష్యాన్ని సెయింట్ లూసియా సునాయసంగా ఛేదించింది.లూయిస్ సెంచరీ వృధా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సెయింట్ కిట్స్ ఓపెనర్ ఎవెన్ లూయిస్ సెంచరీతో మెరిశాడు. 54 బంతులు ఎదుర్కొన్న 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. అతడితో పాటు కైల్ మైర్స్(92) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సెయింట్ కిట్స్ ఓటమి పాలవ్వడంతో వీరి ఇన్నింగ్స్ వృధా అయిపోయింది. -
దంచికొట్టిన రొమారియో షెపర్డ్.. ప్రిటోరియస్ ఆల్‌రౌండ్ షో
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. సైమ్ అయూబ్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), షిమ్రోన్ హెట్‌మైర్ (22 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), కీమో పాల్ (31 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), ప్రిటోరియస్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), రొమారియో షెపర్డ్ (7 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పేట్రియాట్స్ బౌలర్లలో ఒషేన్ థామస్ 3 వికెట్లు పడగొట్టగా.. కోర్బిన్ బోష్, జార్జ్ లిండే, డొమినిక్ డ్రేక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పేట్రియాట్స్.. ప్రిటోరియస్ (3-0-17-3), గుడకేశ్ మోటీ (4-0-15-2), రొమారియో షెపర్డ్ (1/19), జూనియర్ సింక్లెయిర్ (1/10), సైమ్ అయూబ్ (1/2) ధాటికి 17.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో అందరూ దారుణంగా విఫలమయ్యారు. కోర్బిన్ బోష్ (27), జార్జ్ లిండే (13), ఆండ్రీ ఫ్లెచర్ (11), యాన్నిక్ కారియా (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఓటమితో ప్రస్తుత ఎడిషన్‌లో పేట్రియాట్స్ పరాజయాల సంఖ్య 5కు చేరింది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ గెలువలేదు. 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. -
'ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది పంత్?!'
ఐపీఎల్ 2022లో లక్నోసూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విలువైన రివ్యూను అనవసరంగా వృథా చేసుకుంది. ఏ మ్యాచ్‌లో అయినా రివ్యూకు వెళ్లడానికి ముందు కీపర్‌ను అడుగుతుంటారు. ఎందుకంటే బ్యాట్స్‌మన్ ఔటా కాదా అనేది కీపర్‌కు స్పష్టంగా తెలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ పంత్ ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 11వ ఓవర్ లలిత్ యాదవ్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని లలిత్ యాదవ్ ఎవిన్ లుయీస్కు గుడ్‌లెంగ్త్‌తో వేశాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో లూయిస్ బంతిని మిస్ చేయగా.. అది లెగ్ స్టంప్ మీదుగా వెళ్లింది. అంతే పంత్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఔట్ అంటూ గట్టిగా అరిచారు. అయితే అంపైర్ మాత్రం నాటౌట్ అని చెప్పి లెగ్‌బై ఇచ్చాడు. పంత్ ఔటా కాదా చెప్పాల్సింది పోయి వార్నర్ సహా మిగతా ఆటగాళ్లను అడిగాడు. వాళ్లు బంతి క్లోజ్‌గా వెళ్లింది కాబట్టి ఔట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడంతో పంత్ ఏం ఆలోచించకుండా రివ్యూకు వెళ్లిపోయాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి లెగ్ స్టంప్ పక్కనుంచి దూరంగా వెళుతున్నట్లు క్లియర్‌గా కనిపించింది. అలా ఢిల్లీ క్యాపిటల్స్ తమకున్న రెండు రివ్యూలను వృథా చేసుకుంది. దీంతో అభిమానులు పంత్‌ను.. ''ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది'' అంటూ ట్రోల్ చేశారు. చదవండి: David Warner: ముందు అవకాశం లేకుండే.. తర్వాత ఆడతాడనుకుంటే! IPL 2022: షాబాజ్ అహ్మద్.. సివిల్ ఇంజనీర్ నుంచి క్రికెటర్ దాకా -
లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం!
ఐపీఎల్-2022లో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు ఏవిన్ లూయిస్ గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం(ఏప్రిల్4)న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో.. రాహుల్ త్రిపాఠి కొట్టిన బంతిని ఆపే క్రమంలో లూయిస్ గాయపడ్డాడు. దీంతో గురువారం(ఏప్రిల్7) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు అతడి అందుబాటుపై సందేహాం నెలకొంది. ఒక వేళ అతడు మ్యాచ్‌కు దూరమైతే అతడి స్థానంలో మరో కరీబియన్ ఆటగాడు కైల్ మైయర్స్ తుది జట్టులోకి అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన లూయిస్ 66 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక అర్థసెంచరీ కూడా ఉంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, కైల్ మైయర్స్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై/దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మన్దీప్ సింగ్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్ చదవండి: KKR Vs MI: అస్సలు ఊహించలేదు.. జీర్ణించుకోవడం కష్టమే.. కానీ: రోహిత్ శర్మ -
సుందర్- ఎవిన్ లూయిస్ చిత్రమైన యుద్దం.. చివరికి
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్ వాషింగ్టన్ సుందర్, లక్నో బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయిస్ మధ్య చిత్రమైన యుద్దం జరిగింది. టాస్ ఓడిన లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే స్పిన్నర్ సుందర్‌ను బరిలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ సుందర్ లక్నోకు ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఒక్క పరుగు చేసిన డికాక్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి ఎవిన్ లూయిస్ వచ్చాడు. స్పిన్‌ను సరిగా ఆడడనే అపవాదు లూయిస్‌కు ఉంది. దానికి అనుగుణంగానే సుందర్ లూయిస్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. సుందర్ తన తొలి స్పెల్‌లో మూడు బంతులను ఒకే రకంగా వేశాడు. ఎవిన్ లూయిస్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. తొలిసారి బంతి ప్యాడ్లను తాకడంతో సుందర్ అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఎస్ఆర్హెచ్ రివ్యూకు వెళ్లింది. కానీ అల్ట్రా ఎడ్జ్‌లో లూయిస్ తొలిసారి బతికిపోయాడు. ఇక రెండోసారి దాదాపు అదే రకమైన బంతి రావడం.. ఈసారి కూడా లూయిస్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించాడు. కానీ బంతి ప్యాడ్లను తాకి వెళ్లింది. సుందర్ అప్పీల్ చేసినప్పటికీ ఎస్ఆర్హెచ్ రివ్యూకు వెళ్లలేదు. ముచ్చటగా మూడోసారి మాత్రం సుందర్ పైచేయి సాధించాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో లూయిస్ ప్యాడ్లను బంతి తాకింది. ఈసారి మాత్రం ఔట్ అన్న కాన్ఫిడెంట్‌తో సుందర్ గట్టిగా అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా తన వేలును పైకెత్తి ఔట్ సింబల్ చూపించాడు. అలా ఎట్టకేలకు సుందర్ మూడోసారి లూయిస్‌పై గెలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్కే పని అంతే! సుందర్-ఎవిన్ లూయిస్ వీడియో కోసం క్లిక్ చేయండి -
T20 Format: ఆ జట్టు కెప్టెన్‌గా ధోని.. ఓపెనర్‌గా రోహిత్!
Evin Lewis picks his all time T20I playing XI: రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ తన ఆల్-టైమ్ టీ20 ఫ్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. తను ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్‌గా లూయిస్ ఎంచుకున్నాడు. అదే విధంగా.. యూనివర్స్‌ల్ బాస్ క్రిస్ గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక రన్ మిషన్ విరాట్ కోహ్లికు మూడో స్ధానంలో, సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు నాలుగో స్ధానంలో చోటు దక్కింది. జట్టులో ఐదో స్థానంలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కు అవకాశం ఇచ్చాడు ఎవిన్ లూయిస్. భారత్‌కు 2007లో టీ20 ప్రపంచకప్ అందించిన ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా లూయిస్ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో ఆండ్రీ రస్సెల్, రవీంద్ర జడేజాకు చోటు కల్పించాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రషీద్ ఖాన్‌ను లూయిస్ ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్‌కు తన జట్టులో లూయిస్ స్థానం కల్పించాడు. చదవండి: Virat Kohli: మంచు కొంప ముంచుతోంది.. ఒక్కటి మినహా టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే.. టాస్ ఓడితే ఇక అంతేనా? ఎవిన్ లూయిస్ ఆల్-టైమ్ టీ20 XI: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్, ఎంస్ ధోని (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
CPL 2021: లూయిస్ సిక్సర్ల విధ్వంసం.. దర్జాగా ఫైనల్‌కు
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో ఎవిన్ లూయిస్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన లూయిస్ ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ ఘన విజయాన్ని సాధించి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: Lasit Malinga: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు; ఇక ఎవరికి సాధ్యం గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్ కిట్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ లూయిస్ (39 బంతుల్లో 77 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసానికి తోడూ క్రిస్ గేల్ (27 బంతుల్లో 42, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బ్రేవో 31 బంతుల్లో 34,3 ఫోర్లు, 1 సిక్సర్) తోడవ్వడంతో సునాయాసంగా విజయం సాధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్‌మైర్ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 27, చంద్రపాల్ 27 పరుగులు చేశారు. Evin Lewis: 11 సిక్సర్లతో లూయిస్ విధ్వంసం.. సెంచరీతో గెలిపించాడు Yet again Evin Lewis produces a batting masterclass and earns the @Dream11 MVP from semi final two. #CPL21 #GAWvSKNP #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/qoKzrsz9fi — CPL T20 (@CPL) September 14, 2021 -
11 సిక్సర్లతో లూయిస్ విధ్వంసం.. సెంచరీతో గెలిపించాడు
సెంట్కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2021)లో ఎవిన్ లూయిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ఆద్యంతం సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం సృష్టించిన లూయిస్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. 52 బంతుల్లో 102 పరుగులు చేసిన లూయిస్ ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ విజయంతో సెంట్ కిట్స్ పాయింట్ల పట్టికలో టాప్ స్థానానికి చేరుకొని ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. చదవండి: Nicholas Pooran: సిక్సర్లతో శివమెత్తిన పూరన్.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖర్లో సునీల్ నరైన్( 18 బంతుల్లో 33, 4 సిక్సర్లు, ఒక ఫోర్) ఆకట్టుకున్నాడు. సెంట్ కిట్స్ బౌలర్లలో డొమినిక్ డ్రేక్స్ , జాన్ జాగేసర్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ కిట్స్‌కు ఓపెనర్లు గేల్, లూయిస్‌లు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా గేల్ ఉన్నంతసేపు దడదడలాడించాడు. 18 బంతుల్లో 35 పరుగులు చేసిన గేల్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, సిక్సర్ ఉన్నాయి. గేల్ ఔటైన తర్వాత బాధ్యతను ఎత్తుకున్న లూయిస్ మిగతా పనిని పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన లూయిస్ మ్యాచ్‌ను గెలిపించాడు. చదవండి: IPL 2021: బెయిర్ స్టో స్థానంలో విండీస్ స్టార్ ఆటగాడు Evin Lewis 💯 This #IPL gonna be good! @rajasthanroyals 🔥🔥 #RR pic.twitter.com/kumGve2Hrc — Frank (@franklinnnmj) September 12, 2021 -
విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్
న్యూఢిల్లీ: సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకోవడంతో ఆయా ఫ్రాంచైజీలు వారి స్థానాలను భర్తీ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇదివరకే చాలా జట్లు రిప్లేస్మెంట్ ఆటగాళ్లును ఎంపిక చేసుకున్నాయి. తాజాగా, రాజస్తాన్ రాయల్స్ జట్టు వ్యక్తిగత కారణాల చేత లీగ్‌కు దూరంగా ఉన్న జోస్ బట్లర్ స్థానాన్ని విండీస్ విధ్వంసకర యోధుడు ఎవిన్ లూయిస్‌తో భర్తీ చేయాలని నిర్ణయించింది. అలాగే గాయం కారణంగా లీగ్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్లేస్‌ను విండీస్‌కే చెందిన ఒషేన్ థోమాస్‌తో రీప్లేస్ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఒషేన్ థోమాస్కు ఐపీఎల్లో ఇదే జట్టుకు 4 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇక ఎవిన్ లూయిస్ విషయానికొస్తే.. ఈ పవర్ హిట్టర్ గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు 16 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ముంబై తరఫున అతను 131 స్ట్రయిక్ రేట్‌తో 430 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా, ఎవిన్ లూయిస్‌కు అంతర్జాతీయ టీ20ల్లో హార్డ్ హిట్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. అతను విండీస్ తరఫున 45 మ్యాచ్‌ల్లో 158 స్ట్రయిక్ రేట్‌తో 1318 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, సంజూ సామ్సన్ నేతృత్వంలోని ఆర్ఆర్ జట్టు ఐపీఎల్ సెకెండ్ లెగ్‌లో తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 21న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్.. పంజాబ్ కింగ్స్‌ను ఢీకొంటుంది. ప్రస్తుత సీజన్లో ఆర్ఆర్ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడండి.. టీమిండియా దెబ్బ తిన్న పులిలా గర్జిస్తుంది -
లూయిస్ సిక్సర్ల వర్షం; విండీస్ ఘన విజయం
సెంట్ లూసియా: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బాదుడే పనిగా పెట్టుకున్న లూయిస్ సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తం 34 బంతులెదుర్కొన్న లూయిస్ 79 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగుల చేసింది. లూయిస్‌కు జతగా గేల్ 21, కెప్టెన్ నికోలస్ పూరన్ 31, సిమన్స్ఖ్ 21 సహకరించడంతో భారీ స్కోరు నమోదయింది. ఆసీస్ బౌలర్లలో అండ్రూ టై 3, ఆడమ్ జంపా, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఆరోన్ ఫించ్ 34, మిచెల్ మార్ష్ 30 పరుగులు చేశారు. బ్యాటింగ్‌లో విఫలమైన రసెల్ బౌలింగ్‌లో మాత్రం ఇరగదీశాడు. కాట్రెల్‌తో పోటీ పడుతూ రసెల్ 3 వికెట్లు తీశాడు. కాగా ఐదు టీ20ల సిరీస్‌ను విండీస్ 4-1 తేడాతో అందుకొని ఆసీస్‌కు షాక్ ఇచ్చింది. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జూన్ 20 నుంచి మొదలుకానుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా లూయిస్ నిలవగా.. ఇక సిరీస్ ఆధ్యంతం నిలకడగా బౌలింగ్ కనబరిచిన హెడెన్ వాల్ష్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. -
లూయిస్, గేల్ సిక్సర్ల సునామీ.. విండీస్‌దే తొలి టీ20
సెయింట్ జార్జియా: ఓపెనర్ ఎవిన్ లూయిస్(35 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(24 బంతుల్లో 32; ఫోర్, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్(12 బంతుల్లో 23; ఫోర్, 3 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్(19 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20లో విండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో అతిధ్య జట్టు సఫారీలను మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వాన్ డర్ డుసెన్ (38 బంతుల్లో 56 పరుగులు), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డికాక్ (24 బంతుల్లో 37) రాణించడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఫాబియన్ అలెన్, బ్రావోలకు తలో రెండు వికెట్లు, హోల్డర్, రసెల్‌లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సఫారీ బౌలర్ షంషికి ఓ వికెట్ దక్కగా, ఫ్లెచర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరుగనుంది. కాగా, సఫారీలతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిధ్య జట్టు 0-2తేడాతో కోల్పోయింది. చదవండి: WTC Final: ‘ఒక్క గంట ఆట, ఇమేజ్ మొత్తం డ్యామేజీ’ -
సిమ్మన్స్ సిక్సర్ల మోత..
సెయింట్‌కిట్స్: వెస్టిండీస్-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ టైగా ముగిసింది. ఆదివారం జరిగిన చివరి టీ20లో వెస్టిండీస్ ఘన విజయం సాధించి సిరీస్‌ను టై చేసుకుంది. తొలి టీ20లో ఐర్లాండ్ విజయం సాధించగా, రెండో టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. మూడో టీ20లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెవిన్ ఒబ్రెయిన్(36), ఆండ్రూ బాల్బిర్మి(28)లు మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో ఐర్లాండ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది.(ఇక్కడ చదవండి: ఐర్లాండ్ ‘పవర్ ప్లే’ రికార్డు) విండీస్ బౌలర్లు సమష్టిగా రాణించి ఐర్లాండ్‌ను కట్టడి చేశారు. కీరోన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవోలు తలో మూడు వికెట్లతో రాణించగా, రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్‌లు చెరో వికెట్ తీశారు.ఆపై 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ వికెట్ మాత్రమే నష్టపోయి విజయం సాధించింది. ఎవిన్ లూయిస్(46; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించగా, లెండిల్ సిమ్మన్స్(91 నాటౌట్; 40 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల మోత మోగించి ఐర్లాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. సిమ్మన్స్ సాధించిన పరుగుల్లో 80 పరుగులు ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. దాంతో విండీస్ 11 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. -
వెస్టిండీస్ శుభారంభం
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి వన్డేలో విండీస్ 5 వికెట్లతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత ఐర్లాండ్‌ను పేసర్ అల్జారి జోసెఫ్ (4/32) దెబ్బతీయడంతో ఆ జట్టు 46.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. టక్కర్ (68 బంతుల్లో 31; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఛేదన ప్రారంభించిన విండీస్ 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది.ఓపెనర్ ఎవిన్ లూయిస్ (99 బంతుల్లో 99 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. 33.1 ఓవర్లో విండీస్ స్కోరును సమం చేయగా... లూయిస్ 95 పరుగుల వద్ద నిలిచాడు. ఆ తర్వాతి బంతిని లూయిస్ సిక్సర్‌గా మలిస్తే శతకం సాధించే అవకాశం ఉండగా... అతను ఫోర్ కొట్టాడు. దీంతో అతను సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు జోసెఫ్‌కు లభించింది. -
తొలి టీ20: టీమిండియా లక్ష్యం 208
హైదరాబాద్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక ఉప్పల్ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియాకు వెస్టిండీస్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి ఫార్మట్‌కు పెట్టింది పేరైన కరేబియన్ ఆటగాళ్లు వచ్చిన వారు వచ్చినట్టు యథేచ్చగా బ్యాట్ ఝుళిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్ ఆటగాళ్లలో హెట్‌మైర్(56; 41 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), లూయిస్(40; 17 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్(37;19 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో జాసన్ హోల్డర్(24; 9 బంతుల్లో 1ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో కోహ్లి సేన ముందు విండీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో చహల్ రెండు, జడేజా, చహర్, సుందర్‌లు తలో వికెట్ పడగొట్టాడరు. జోరును అడ్డుకోలేకపోయిన బౌలర్లు.. కరేబియన్ బ్యాట్స్‌మన్ జోరుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. దీనికితోడు చెత్త ఫీల్డింగ్‌తో కోహ్లి సేన భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఒకటి కాదు రెండు కాదు అనేక క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు. ఇక బౌలర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న దీపక్ చహర్ ఏ మాత్రం ప్రభావం చూపెట్టలేకపోయాడు. నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ పడగొట్టి ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఆరంభం నుంచి ధాటిగానే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ వాషింగ్టన్ సుందర్ వేసిన తొలి ఓవర్లోనే 13 పరుగులు పిండుకుంది. అయితే దీపక్ చహర్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ సిమన్స్(2) రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్‌తో కలిసి లూయిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిడు. ముఖ్యంగా లూయీస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి విండీస్ 50 పరుగులు దాటేసింది. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో లూయిస్(40; 17 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్(31; 23 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మణికట్టు స్పిన్నర్ చహల్ బౌలింగ్‌లో పొలార్డ్(37) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదే ఓవర్లో హెట్‌మైర్(56) కూడా భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఓకే ఓవర్లో విండీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. -
లూయిస్ మెరుపులు
ఢాకా: విండీస్ విధ్వంసక ఓపెనర్ ఎవిన్ లూయిస్ (36 బంతుల్లో 89; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరిదైన మూడో టి20లో వెస్టిండీస్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. బంగ్లా పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన విండీస్ పొట్టి ఫార్మాట్లో సత్తా చాటింది. లూయిస్ మెరుపులకు తోడు షై హోప్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్ (29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లూయిస్ తుపానులా విరుచుకుపడటంతో 7.2 ఓవర్లలోనే విండీస్ స్కోరు 100 దాటింది. మూడో వికెట్ రూపంలో అతను వెనుదిరిగే సమయానికి విండీస్ స్కోరు 9.2 ఓవర్లలో 122/3. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు మహ్ముదుల్లా (3/18), ముస్తఫిజుర్ (3/33), షకీబుల్ హసన్ (3/37) కట్టడి చేయడంతో విండీస్ చివరకు 190 పరుగులకు పరిమితమైంది. లక్ష్యఛేదనలో బంగ్లా 17 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (25 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా... తమీమ్ ఇక్బాల్ (8), సౌమ్య సర్కార్ (9), షకీబ్ (0), ముష్ఫికర్ రహీం (1) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 5 వికెట్లు పడగొట్టగా, అలెన్‌కు 2 వికెట్లు దక్కాయి. -
వెస్టిండీస్‌కు మరోదెబ్బ
గువాహటి: ఇప్పటికే ఐదు రోజుల మ్యాచ్‌ల్ని మూడే రోజుల్లో ముగించుకొని క్లీన్‌స్వీప్ అయిన విండీస్‌కు మరోదెబ్బ తగిలింది. డాషింగ్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో సిరీస్‌కు దూరమైనట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్లాగే ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌లకు అందుబాటులో ఉండాలనే కారణంతో లూయిస్ ఇటీవల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నుంచి సెంట్రల్ కాంట్రాక్టును నిరాకరించాడు. షార్జాలో ప్రస్తుతం అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న గేల్ ఇంతకుముందే భారత్‌తో జరిగే ఐదు వన్డేలు, మూడు టి20ల సిరీస్‌లకు అందుబాటులో ఉండనని ప్రకటించాడు. తాజాగా లూయిస్ దూరమవడం జట్టుకు లోటే! భారత్‌పై అతనికి మంచి రికార్డు ఉంది. టీమిండియాతో అతను మూడు టి20లు ఆడగా రెండింటిలో సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు అతని స్థానాన్ని కీరన్ పావెల్‌తో, జోసెఫ్ స్థానాన్ని మెకాయ్‌తో భర్తీ చేశారు. విండీస్ మేటి క్రికెటర్లలో ఒకడైన శివ్‌నారాయణ్ చందర్‌పాల్ తనయుడు హేమ్రాజ్ తొలిసారి సీనియర్ జట్టులోకి ఎంపికయ్యాడు. భారత్, విండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తొలి మ్యాచ్ ఈనెల 21న గువాహటిలో జరుగుతుంది. వెస్టిండీస్ వన్డే జట్టు: హోల్డర్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, చందర్‌పాల్ హేమ్రాజ్, హెట్మెయిర్, హోప్, మెకాయ్, యాష్లే నర్స్, కీమో పాల్, కీరన్ పావెల్, రోవ్‌మన్ పావెల్, రోచ్, మార్లోన్ శామ్యూల్స్, ఓషేన్ థామస్. టి20 జట్టు: కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలెన్ సునీల్, బ్రేవో, హెట్మెయిర్, మెకాయ్, యాష్లే నర్స్, కీమో పాల్, ఖారీ పియరే, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, రామ్‌దిన్, ఆండ్రీ రసెల్, రూథర్‌ఫోర్డ్, ఓషేన్ థామస్. -
72 పరుగులతో వెస్టిండీస్ భారీ విజయం!
లండన్ : ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుపై 72 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. హరికేన్ కారణంగా దెబ్బతిన్న మైదానాల పునరుద్ధరణకు నిధులు సేకరించే నిమిత్తం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఈ చారిటీ టీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేశారు. చెలరేగి ఆడిన ఎవిన్ లెవిస్ 26 బంతుల్లో 58 పరుగులు చేశాడు. షాహిద్ ఆఫ్రిదీ నేతృత్వంలో బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవన్ జట్టు.. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలపడింది. ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. థిసరా పేరారా ఒక్కడే రాణించి 61 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు చేతులు ఎత్తేయడంతో 127 పరుగులకు వరల్డ్ ఎలెవన్ చాప చుట్టేసింది. దీంతో టీ-20 చాంపియన్స్ వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. అద్భుతంగా రాణించిన ఎవిన్ లెవిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. -
రోహిత్ విధ్వంసక ఇన్నింగ్స్
-
అనూహ్యం: వన్డే క్రికెట్ చరిత్రలో మూడోసారి..
లండన్: వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయీస్ మెరుపు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించినా.. బౌలింగ్‌లో అల్జారి జోసెఫ్ ఐదు వికెట్లతో చెలరేగినా ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఎవరూ ఊహించని రీతిలో నాలుగో వన్డేలో విండీస్‌పై ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. విండీస్ తరఫున సెంచరీతో పాటు ఐదు వికెట్ల ఇన్నింగ్స్ నమోదైనా వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. తద్వారా ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో ఇలాంటి ఫలితం రావడం ఇది మూడోసారి. మరొకవైపు వన్డేల్లో ఈ తరహా అరుదైన ఓటమిని రెండోసారి చవిచూసిన జట్టుగా విండీస్ నిలిచింది. ఆ విశేషాలిలా... ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో తొలుత విండీస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లూయీస్ (130 బంతుల్లో 176 రిటైర్డ్‌హర్ట్; 17 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత సెంచరీ చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. ఆపై విండీస్ బౌలర్ అల్జారి జోసెఫ్ ఐదు వికెట్ల ఇన్నింగ్స్ (5/56 )తో చెలరేగడంతో ఇంగ్లండ్ 181 పరగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరో వికెట్‌కు బట్లర్ 43 నాటౌట్, మొయిన్ అలీ 48 నాటౌట్లు 77 పరుగుల జోడించారు. 35.1 ఓవర్లలో 258 పరుగుల వద్ద వరుణుడు ఆటకం కలిగించడంతో మ్యాచ్ కొనసాగలేదు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 35.1 ఓవర్లలో ఇంగ్లండ్ విజయక్ష్యం 253గా నిర్ణయించడంతో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. గతంలో రెండు పర్యాయాలు.. ఇదే ఫలితం 1991-1992లో షార్జాలో వెస్టిండీస్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఇలాంటి ఫలితం వచ్చింది. విండీస్ జట్టులో ఓ ఆటగాడు సెంచరీ సాధించడం, అదే జట్టు బౌలర్ ఐదు వికెట్లతో చెలరేగినా కరీబియన్లకు నిరాశే ఎదురైంది. తొలుత 50 ఓవర్లలో పాక్ 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. 237 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లాడి 235 పరగులకు ఆలౌట్ అయి పరుగుతేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఆటగాడు రిచి రిచర్డ్సన్ శతకం (122)తో పాటు బౌలింగ్‌లో ఆంబ్రోస్ (5/53)తో చెలరేగినా ఓటమి తప్పలేదు. 2005-2006 సీజన్లలో జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఐదో వన్డేలో రికార్డు పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా జట్టు రికీ పాంటింగ్ శతకం (164)తో రాణించడంతో ఆ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 434 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను ఆసీస్ బౌలర్ నాథన్ బ్రాకెన్ ఐదు వికెట్ల ఇన్నింగ్స్ (5/67)తో చెలరేగి కట్టడి చేసినా ప్రయోజనం లేకపోయింది. సఫారీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (90), గిబ్స్ భారీ శతకం (175 పరుగులు)తో అద్భుత విజయం సాధించింది. సిరీస్‌ను సఫారీలు 3-2తో కైవసం చేసుకున్నారు. -
9 సిక్సర్లు.. 5 ఫోర్లు
ట్రినిడాడ్: ట్వంటీ 20 సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ జరిగిన మూడో ట్వంటీ 20 లో వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ సూపర్ షో ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 91 పరుగులు సాధించిన లూయిస్.. విండీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లూయిస్ విజృంభణతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయిన వెస్టిండీస్ 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కమ్రాన్ అక్మల్(48), బాబర్ అజమ్(43), ఫకర్ జమాన్(21)లు మాత్రమే రెండెంకల స్కోరును నమోదు చేశారు. మిగతా పాక్ ఆటగాళ్లు నిరాశపరచడంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో విజయంతో నాలుగు ట్వంటీ 20 సిరీస్ లో్ ఆశల్ని విండీస్ సజీవంగా నిలుపుకుంది. అంతకుముందు రెండు ట్వంటీ 20లను పాక్ గెలిచిన సంగతి తెలిసిందే. -
విండీస్‌తో టీ20: భారత్ టార్గెట్ 246
భారత్‌తో రెండు టీ20 మ్యాచ్ సిరీస్ లో భాగంగా శనివారం రాత్రి జరుగుతున్న తొలి ట్వంటీ-20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఓపెనర్ లెవిస్ చెలరేగి 48 బంతుల్లోనే శతకం సాధించాడు. భారత్ ముందు విండీస్ 246 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అంతకు ముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెరీర్ లో తొలి టీ20 శతకం బాదిన లెవిస్ సుడిగాలిలా విజృంభించి ఆడాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో సింగిల్ తీసుకుని సెంచరీ మార్కు చేరుకున్నాడు. సెంచరీ చేయడంలో భాగంగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డ లెవిస్ 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా బిన్నీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో లెవిస్ 5 సిక్సర్లతో హడలెత్తించాడు. ఆ ఓవర్లో వైడ్, ఓ సింగిల్‌తో కలిపి బిన్నీ 32 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా వేసిన చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడంతో విండీస్ 250 మార్కు చేరుకోలేకపోయింది. తొలి బంతికి బ్రాత్ వైట్(14) రనౌట్ కాగా, నాలుగో బంతికి పోలార్డ్ ను బౌల్డ్ చేశాడు. ఐదో బంతికి సిమ్మన్స్(0)ను పెవిలియన్ బాట పట్టించాడు. టర్నింగ్ పాయింగ్: 16 ఓవర్లో మూడో బంతికి రస్సెల్(22)ను, ఐదో బంతికి లెవిస్ ను జడేజా పెవిలియన్ బాట పట్టించాడు. లేకపోతే పరస్థితి మరోలా ఉండేది. ఓద దశలో 200/1 తో ఉన్న విండీస్ వెంటనే 205/3 గా మారింది. చార్లెస్ (33 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించాడు. .