విండీస్తో టీ20: భారత్ టార్గెట్ 246
భారత్తో రెండు టీ20 మ్యాచ్ సిరీస్ లో భాగంగా శనివారం రాత్రి జరుగుతున్న తొలి ట్వంటీ-20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఓపెనర్ లెవిస్ చెలరేగి 48 బంతుల్లోనే శతకం సాధించాడు. భారత్ ముందు విండీస్ 246 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అంతకు ముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెరీర్ లో తొలి టీ20 శతకం బాదిన లెవిస్ సుడిగాలిలా విజృంభించి ఆడాడు.
స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో సింగిల్ తీసుకుని సెంచరీ మార్కు చేరుకున్నాడు. సెంచరీ చేయడంలో భాగంగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డ లెవిస్ 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా బిన్నీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో లెవిస్ 5 సిక్సర్లతో హడలెత్తించాడు. ఆ ఓవర్లో వైడ్, ఓ సింగిల్తో కలిపి బిన్నీ 32 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా వేసిన చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడంతో విండీస్ 250 మార్కు చేరుకోలేకపోయింది. తొలి బంతికి బ్రాత్ వైట్(14) రనౌట్ కాగా, నాలుగో బంతికి పోలార్డ్ ను బౌల్డ్ చేశాడు. ఐదో బంతికి సిమ్మన్స్(0)ను పెవిలియన్ బాట పట్టించాడు.
టర్నింగ్ పాయింగ్:
16 ఓవర్లో మూడో బంతికి రస్సెల్(22)ను, ఐదో బంతికి లెవిస్ ను జడేజా పెవిలియన్ బాట పట్టించాడు. లేకపోతే పరస్థితి మరోలా ఉండేది. ఓద దశలో 200/1 తో ఉన్న విండీస్ వెంటనే 205/3 గా మారింది. చార్లెస్ (33 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించాడు. .