ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 45.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుడకేశ్ మోటీ (4/41) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ కర్రన్ 37, జాకబ్ బేతెల్ 27, జోర్డన్ కాక్స్ 17, ఫిలిప్ సాల్ట్ 18, విల్ జాక్స్ 19, ఆదిల్ రషీద్ 15, డాన్ మౌస్లీ 8, జేమీ ఓవర్టన్ 0, జోఫ్రా ఆర్చర్ 7 పరుగులు చేశారు.
అనంతరం వెస్టిండీస్ స్వల్ప లక్ష్య ఛేదనకు దిగగా వర్షం పలు మార్లు అంతరాయం కలిగించింది. విండీస్ స్కోర్ 157/2 (25.5 ఓవర్లు) వద్ద నుండగా మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన విండీస్‌ను విజేతగా ప్రకటించారు.
విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్
స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ ఎవిన్ లెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడా పెడా బౌండరీలు, సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు. 69 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో బ్రాండన్ కింగ్ 30, కీసీ కార్టీ 19, షాయ్ హోప్ 6 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, మూడు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి విండీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆంటిగ్వా వేదికగా నవంబర్ 2న జరుగనుంది.
చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment