పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలో 8 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్డిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే శ్రీలంక స్కోర్ 17.2 ఓవర్లలో 81-1 వద్ద వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.
ఆ తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత మ్యాచ్ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్‌కు 23 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(22 బంతుల్లో 56, 9 ఫోర్లు, ఒక సిక్సర్), నిస్సాంక(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
అనంతరం డక్‌వర్త్‌లూయిస్ పద్దతి ప్రకారం విండీస్ టార్గెట్‌ను 23 ఓవర్లలో 195 పరుగులగా నిర్ణయించారు. ఈ భారీ లక్ష్యాన్ని విండీస్ సునాయసంగా ఛేదించేసింది. 22 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కరేబియన్లు ఊదిపడేశారు.
లూయిస్ విధ్వంసకర సెంచరీ..
కాగా మూడేళ్ల తర్వాత విండీస్ వన్డే జట్టులోకి వచ్చిన ఓపెనర్ ఎవిన్ లూయిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో లూయిస్ 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు సర్ఫెన్ రూథర్ ఫర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ ఓటమితో విండీస్ వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. అదేవిధంగా తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన శ్రీలంక 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Back like he never left! 💪🏻
In an emphatic win for the West Indies, Evin Lewis smashed an unbeaten 102 off 61 balls against Sri Lanka in his first ODI since 2021! 😍#SLvWIonFanCode pic.twitter.com/0nr2rTs01j— FanCode (@FanCode) October 27, 2024
Comments
Please login to add a commentAdd a comment