స్వదేశంలో విండీస్‌తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లలో శ్రీలంక జోరు కొనసాగుతోంది. 2-1 తేడాతో ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న లంకేయులు.. తాజాగా వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకున్నారు. నిన్న (అక్టోబర్ 23) జరిగిన రెండో వన్డేలో అసలంక సేన 5 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 36 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (80), గుడకేశ్ మోటీ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 58 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన విండీస్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. తీక్షణ (3/25), అషిత ఫెర్నాండో (3/35), హసరంగ (4/40) విండీస్‌ను దెబ్బకొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. అసలంక (62 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో 38.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో నిషన్ మధుష్క (38), సమరవిక్రమ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ రెండు, మోటీ, ఛేజ్ తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రమైన మూడో వన్డే అక్టోబర్ 26న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment