శ్రీలంకలో విండీస్‌ పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే..! | West Indies Is Set To Travel Sri Lanka For White Ball Series | Sakshi
Sakshi News home page

శ్రీలంకలో విండీస్‌ పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే..!

Published Fri, Sep 27 2024 6:25 PM | Last Updated on Fri, Sep 27 2024 6:57 PM

West Indies Is Set To Travel Sri Lanka For White Ball Series

శ్రీలంకలో వెస్టిండీస్‌ పర్యటన ఖరారైంది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌ అక్టోబర్‌ 13, 15, 17 తేదీల్లో డంబుల్లా వేదికగా జరుగనుంది. అనంతరం అక్టోబర్‌ 20 నుంచి వన్డే సిరీస్‌ మొదలుకానుంది. ఈ సిరీస్‌ అక్టోబర్‌ 20, 23, 26 తేదీల్లో క్యాండీ వేదికగా జరుగనుంది.

కాగా, ఇటీవలికాలంలో శ్రీలంక ఫార్మాట్లకతీతంగా రాణిస్తుంది. స్వదేశంలో భారత్‌ను వన్డే సిరీస్‌లో 2-0 తేడాతో ఓడించిన శ్రీలంక.. ఆతర్వాత ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఓడించింది. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లోనూ శ్రీలంక సత్తా చాటుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ శ్రీలంక పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో లంకేయులు భారీ స్కోర్‌ సాధించారు.

వెస్టిండీస్‌ విషయానికొస్తే.. ఈ కరీబియన్‌ జట్టు ఇటీవల సౌతాఫ్రికాను మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. దానికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను విండీస్‌ 0-1 తేడాతో కోల్పోయింది. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను కూడా వెస్టిండీస్‌ 0-3 తేడాతో కోల్పోయింది. ప్రస్తుతం వెస్టిండీస్‌లో కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జరుగుతుండటంతో ఆటగాళ్లంతా ఆ లీగ్‌లో బిజీగా ఉన్నారు.  

చదవండి: కన్నీటిపర్యంతమైన బ్రావో

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement