47 బంతుల్లో 17 ఫోర్లతో 85 నాటౌట్
రెండో టి20లో విండీస్ విజయం
తొమ్మిది వికెట్లతో ఓడిన భారత్
ముంబై: వెస్టిండీస్‌తో గత టి20 మ్యాచ్ ప్రదర్శనను భారత మహిళలు పునరావృతం చేయలేకపోయారు. సమష్టి వైఫల్యంతో రెండో టి20 మ్యాచ్‌ను పర్యాటక జట్టుకు అప్పగించారు.మంగళవారం జరిగిన ఈ పోరులో విండీస్ మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమం కాగా, చివరి టి20 రేపు జరుగుతుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా... వెస్టిండీస్ 15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన (41 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వికెట్ కీపర్ రిచా ఘోష్ (17 బంతుల్లో 32; 6 ఫోర్లు) దూకుడుగా ఆడింది. స్మృతి ఇచ్చిన మూడు సునాయాస క్యాచ్‌లను (30, 40, 40 పరుగుల వద్ద) విండీస్ ఫీల్డర్లు వదిలేయడం కూడా ఆమెకు కలిసొచ్చింది.
37 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో వెస్టిండీస్ కెపె్టన్ హేలీ మాథ్యూస్ (47 బంతుల్లో 85 నాటౌట్; 17 ఫోర్లు), ఖియానా జోసెఫ్ (22 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 40 బంతుల్లోనే 66 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఖియానా వెనుదిరిగినా...మాథ్యూస్, షిమైన్ క్యాంప్‌బెల్ (26 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు.
వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 55 బంతుల్లోనే 94 పరుగులు జత చేయడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే విండీస్ విజయం ఖాయమైంది. మోకాలికి స్వల్ప గాయంతో బాధపడుతున్న కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండో టి20కి దూరం కావడంతో స్మృతి సారథిగా వ్యవహరించింది. ఆమె స్థానంలో ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల రాఘ్వీ బిస్త్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ఫ్లెచర్ (బి) మాథ్యూస్ 62; ఉమా ఛెత్రి (బి) డాటిన్ 4; జెమీమా (ఎల్బీ) (బి) మాథ్యూస్ 13; రాఘ్వీ (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 5; దీప్తి శర్మ (రనౌట్) 17; రిచా (సి) క్యాంప్‌బెల్ (బి) డాటిన్ 32; సజన (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 2; రాధ (సి) డాటిన్ (బి) హెన్రీ 7; సైమా (సి) డాటిన్ (బి) హెన్రీ 6; టిటాస్ (నాటౌట్) 1; రేణుక (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–35, 3–48, 4–104, 5–108, 6–113, 7–144, 8–149, 9–155. బౌలింగ్: చినెల్ హెన్రీ 4–0–37–2, డాటిన్ 4–0–14–2, హేలీ మాథ్యూస్ 4–0–36–2, కరిష్మా 3–0–19–0, ఫ్లెచర్ 3–0–28–2, అష్మిని 2–0–25–0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (నాటౌట్) 85; ఖియానా జోసెఫ్ (సి) రిచా (బి) సైమా 38; క్యాంప్‌బెల్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 160. వికెట్ల పతనం: 1–66. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–29–0, టిటాస్ సాధు 2–0–32–0, దీప్తి శర్మ 3–0–26–0, సైమా ఠాకూర్ 3–0–28–1, రాధ యాదవ్ 2–0–27–0, సజీవన్ సజన 2.4–0–17–0.
Comments
Please login to add a commentAdd a comment