ప్రావిడెన్స్ (గయానా): వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్ నెగ్గిన భారత్‌కు తొలి టి20లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. సాధారణ లక్ష్యాన్నీ ఛేదించలేక చతికిలపడిన జట్టు ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ కోలుకొని స్థాయికి తగినట్లుగా సత్తా చాటడం అవసరం. ఇలాంటి స్థితిలో నేడు విండీస్‌తో రెండో టి20 మ్యాచ్‌కు హార్దిక్ సేన సిద్ధమైంది. తొలి టి20లా ఆదమరిస్తే మాత్రం ఇక్కడ కుదరదు. అందుకోసం నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్ మారాలి.
స్పిన్ మ్యాజిక్, పేస్ పదును పెరగాలి. గత మ్యాచ్‌లా తేలిగ్గా తీసుకోకూడదు. సీనియర్లు రోహిత్, కోహ్లిలు ఆడకపోవడం వల్లే ఓటమంటే కుదరదు. ఎందుకంటే గత మ్యాచ్ బరిలోకి దిగినవారంతా ఐదారేళ్లుగా ఐపీఎల్‌లో విశేషంగా రాణిస్తున్నవారే! ఐపీఎల్‌లో అతి తక్కువ అనుభవమున్న తిలక్‌వర్మే మొదటి మ్యాచ్‌లోనే చక్కగా ఆడితే... ఐపీఎల్ హిట్లర్లు ఇషాన్ కిషన్, గిల్, సూర్యకుమార్, సంజూ సామ్సన్, అక్షర్, హార్దిక్ పాండ్యా ఇంకెలా ఆడాలి. కాబట్టి సాకులు వెతక్కుండా బ్యాటర్లు తమ శైలిలో మెరుపులు మెరిపిస్తే పరుగులు, విజయం కష్టం కానేకాదు.
ఇక విండీస్ విషయానికొస్తే చెసిన తక్కువ స్కోరునే నిలబెట్టుకొని మరీ ఈ సిరీస్‌లో శుభారంభం చేసింది. ప్రపంచశ్రేణి టి20 స్పెషలిస్టులున్న విండీస్ ఇప్పుడు మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కానీ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment