Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో లక్నోసూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విలువైన రివ్యూను అనవసరంగా వృథా చేసుకుంది. ఏ మ్యాచ్‌లో అయినా రివ్యూకు వెళ్లడానికి ముందు కీపర్‌ను అడుగుతుంటారు. ఎందుకంటే బ్యాట్స్‌మన్ ఔటా కాదా అనేది కీపర్‌కు స్పష్టంగా తెలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ పంత్ ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు.
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 11వ ఓవర్ లలిత్ యాదవ్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని లలిత్ యాదవ్ ఎవిన్ లుయీస్‌కు గుడ్‌లెంగ్త్‌తో వేశాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో లూయిస్ బంతిని మిస్ చేయగా.. అది లెగ్ స్టంప్ మీదుగా వెళ్లింది. అంతే పంత్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఔట్ అంటూ గట్టిగా అరిచారు. అయితే అంపైర్ మాత్రం నాటౌట్ అని చెప్పి లెగ్‌బై ఇచ్చాడు.
పంత్ ఔటా కాదా చెప్పాల్సింది పోయి వార్నర్ సహా మిగతా ఆటగాళ్లను అడిగాడు. వాళ్లు బంతి క్లోజ్‌గా వెళ్లింది కాబట్టి ఔట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడంతో పంత్ ఏం ఆలోచించకుండా రివ్యూకు వెళ్లిపోయాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి లెగ్ స్టంప్ పక్కనుంచి దూరంగా వెళుతున్నట్లు క్లియర్‌గా కనిపించింది. అలా ఢిల్లీ క్యాపిటల్స్ తమకున్న రెండు రివ్యూలను వృథా చేసుకుంది. దీంతో అభిమానులు పంత్‌ను.. ''ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది'' అంటూ ట్రోల్ చేశారు.
చదవండి: David Warner: ముందు అవకాశం లేకుండే.. తర్వాత ఆడతాడనుకుంటే!
IPL 2022: షాబాజ్ అహ్మద్.. సివిల్ ఇంజనీర్ నుంచి క్రికెటర్ దాకా
Comments
Please login to add a commentAdd a comment