PC: IPL Twitter
ఐపీఎల్ 2022 సీజన్‌లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం మరోసారి ఒక బ్యాట్స్‌మన్ కొంపముంచింది. ఇప్పటికే ఈ సీజన్‌లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాలకు ఆటగాళ్లు బలయ్యారు. కోహ్లి ఎల్బీ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా రోహిత్ శర్మ ఔట్ విషయం మరోసారి వివాదానికి తెరలేపింది. సోమవారం ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
టిమ్ సౌతీ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని రోహిత్ శర్మ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్తూ అతడి తొడ భాగాన్ని తాకి కీపర్ కు సమీపంగా వెళ్లింది. కేకేఆర్ కీపర్ షెల్డన్ జాక్సన్ తన కుడివైపుకు అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ ను పూర్తి చేశాడు. కేకేఆర్ ఆటగాళ్లు అవుటంటూ సంబరాలు చేసుకోగా.. అంపైర్ క్రిస్ గఫానీ అవుట్ ఇవ్వలేదు. దాంతో శ్రేయస్ అయ్యర్ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బంతి రోహిత్ బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్లింది. అల్ట్రా ఎడ్జ్ లో చూసినప్పుడు బంతి బ్యాట్ కు దూరంగా ఉన్నా కూడా స్పైక్ కనిపించింది. ఇక బ్యాట్ కు సమీపంగా వచ్చినప్పుడు ఆ స్పైక్ మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ అవుటంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
బంతి బ్యాట్ కు చాలా దూరంగా ఉన్న సమయంలో కూడా అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ కనిపించడం ఆసక్తి కలిగించింది. అయితే బంతి బ్యాట్ కు దగ్గరగా వచ్చినప్పుడు అల్ట్రా ఎడ్జ్ లో బిగ్ స్పైక్ కనిపించడంతో థర్డ్ అంపైర్ రోహిత్ను అవుట్ గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న రోహిత్ కాసేపు మైదానంలో అలాగే నిల్చుండిపోయాడు. ఇక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు రెండుగా చీలిపోయారు. కొందరు థర్డ్ అంపైర్‌ను సమర్థిస్తే.. మరికొందరు రోహిత్‌కు మద్దతుగా నిలిచారు.'' ఈ సీజన్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు అర్థం పర్థం లేకుండా ఉంటున్నాయి. అసలు ఆయన చెక్ చేసే టీవీని ఒకసారి పరిశీలించాలి. బ్యాట్ దూరంగా ఉన్నప్పుడు స్పైక్ రావడం చూస్తుంటే ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తుంది.'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: కోల్‌కథ ముగిసిపోలేదు...ఇంకా ఉంది!
— Diving Slip (@SlipDiving) May 9, 2022
Comments
Please login to add a commentAdd a comment