సుందర్‌- ఎవిన్‌ లూయిస్‌ చిత్రమైన యుద్దం.. చివరికి | Sundar Won VS Evin Lewis Battle 3 Balls-3 Sweeps-3 Appeals | Sakshi
Sakshi News home page

సుందర్‌- ఎవిన్‌ లూయిస్‌ చిత్రమైన యుద్దం.. చివరికి

Published Mon, Apr 4 2022 10:03 PM | Last Updated on Mon, Apr 4 2022 10:14 PM

Sundar Won VS Evin Lewis Battle 3 Balls-3 Sweeps-3 Appeals - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, లక్నో బ్యాట్స్‌మన్‌ ఎవిన్‌ లూయిస్‌ మధ్య చిత్రమైన యుద్దం జరిగింది. టాస్‌ ఓడిన లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే స్పిన్నర్‌ సుందర్‌ను బరిలోకి దించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ సుందర్‌ లక్నోకు ఆదిలోనే షాక్‌ ఇచ్చాడు. ఒక్క పరుగు చేసిన డికాక్‌ను క్యాచ్‌ ఔట్‌ చేశాడు. ఈ దశలో క్రీజులోకి ఎవిన్‌ లూయిస్‌ వచ్చాడు.

స్పిన్‌ను సరిగా ఆడడనే అపవాదు లూయిస్‌కు ఉంది. దానికి అనుగుణంగానే సుందర్‌ లూయిస్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. సుందర్‌ తన తొలి స్పెల్‌లో మూడు బంతులను ఒకే రకంగా వేశాడు. ఎవిన్‌ లూయిస్ స్వీప్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. తొలిసారి బంతి ప్యాడ్లను తాకడంతో సుందర్‌ అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ రివ్యూకు వెళ్లింది. కానీ అల్ట్రా ఎడ్జ్‌లో లూయిస్‌ తొలిసారి బతికిపోయాడు. ఇక రెండోసారి దాదాపు అదే రకమైన బంతి రావడం.. ఈసారి కూడా లూయిస్‌ స్వీప్‌ షాట్‌ ఆడేందుకు యత్నించాడు. కానీ బంతి ప్యాడ్లను తాకి వెళ్లింది. సుందర్‌ అప్పీల్‌ చేసినప్పటికీ ఎస్‌ఆర్‌హెచ్‌ రివ్యూకు వెళ్లలేదు.

ముచ్చటగా మూడోసారి మాత్రం సుందర్‌ పైచేయి సాధించాడు. స్వీప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో లూయిస్‌ ప్యాడ్లను బంతి తాకింది. ఈసారి మాత్రం ఔట్‌ అన్న కాన్ఫిడెంట్‌తో సుందర్‌ గట్టిగా అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ కూడా తన వేలును పైకెత్తి ఔట్‌ సింబల్‌ చూపించాడు. అలా ఎట్టకేలకు సుందర్‌ మూడోసారి లూయిస్‌పై గెలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IPL 2022: ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్‌కే పని అంతే!

సుందర్‌-ఎవిన్‌ లూయిస్‌ వీడియో కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement