లూయిస్‌ సిక్సర్ల వర్షం; విండీస్‌ ఘన విజయం | Evin Lewis Smash 9 Sixes Clinch Solid Victory To West Indies Vs Aus | Sakshi
Sakshi News home page

Evin Lewis: లూయిస్‌ సిక్సర్ల వర్షం; విండీస్‌ ఘన విజయం

Published Sat, Jul 17 2021 10:26 AM | Last Updated on Sat, Jul 17 2021 10:36 AM

Evin Lewis Smash 9 Sixes Clinch Solid Victory To West Indies Vs Aus - Sakshi

ఎవిన్‌ లూయిస్‌

సెంట్‌ లూసియా: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో విండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి బాదుడే పనిగా పెట్టుకున్న లూయిస్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తం 34 బంతులెదుర్కొన్న లూయిస్‌ 79 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగుల చేసింది. లూయిస్‌కు జతగా గేల్‌ 21, కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ 31, సిమన్స్ఖ్ 21 సహకరించడంతో భారీ స్కోరు నమోదయింది. ఆసీస్‌ బౌలర్లలో అండ్రూ టై 3, ఆడమ్‌ జంపా, మిచెల్‌ మార్ష్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఆరోన్‌ ఫించ్‌ 34, మిచెల్‌ మార్ష్‌ 30 పరుగులు చేశారు. బ్యాటింగ్‌లో విఫలమైన రసెల్‌ బౌలింగ్‌లో మాత్రం ఇరగదీశాడు. కాట్రెల్‌తో పోటీ పడుతూ రసెల్‌ 3 వికెట్లు తీశాడు. కాగా ఐదు టీ20ల సిరీస్‌ను విండీస్‌ 4-1 తేడాతో అందుకొని ఆసీస్‌కు షాక్‌ ఇచ్చింది. ఇక ఇరు జట్ల మధ్య  మూడు వన్డేల సిరీస్‌ జూన్‌ 20 నుంచి మొదలుకానుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా లూయిస్‌ నిలవగా.. ఇక సిరీస్‌ ఆధ్యంతం నిలకడగా బౌలింగ్‌ కనబరిచిన హెడెన్‌ వాల్ష్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement