గువాహటి: ఇప్పటికే ఐదు రోజుల మ్యాచ్‌ల్ని మూడే రోజుల్లో ముగించుకొని క్లీన్‌స్వీప్ అయిన విండీస్‌కు మరోదెబ్బ తగిలింది. డాషింగ్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో సిరీస్‌కు దూరమైనట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌లాగే ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌లకు అందుబాటులో ఉండాలనే కారణంతో లూయిస్ ఇటీవల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నుంచి సెంట్రల్ కాంట్రాక్టును నిరాకరించాడు. షార్జాలో ప్రస్తుతం అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న గేల్ ఇంతకుముందే భారత్‌తో జరిగే ఐదు వన్డేలు, మూడు టి20ల సిరీస్‌లకు అందుబాటులో ఉండనని ప్రకటించాడు. తాజాగా లూయిస్ దూరమవడం జట్టుకు లోటే! భారత్‌పై అతనికి మంచి రికార్డు ఉంది. టీమిండియాతో అతను మూడు టి20లు ఆడగా రెండింటిలో సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు అతని స్థానాన్ని కీరన్ పావెల్‌తో, జోసెఫ్ స్థానాన్ని మెకాయ్‌తో భర్తీ చేశారు. విండీస్ మేటి క్రికెటర్లలో ఒకడైన శివ్‌నారాయణ్ చందర్‌పాల్ తనయుడు హేమ్‌రాజ్ తొలిసారి సీనియర్ జట్టులోకి ఎంపికయ్యాడు. భారత్, విండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తొలి మ్యాచ్ ఈనెల 21న గువాహటిలో జరుగుతుంది.
వెస్టిండీస్ వన్డే జట్టు: హోల్డర్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, చందర్‌పాల్ హేమ్‌రాజ్, హెట్‌మెయిర్, హోప్, మెకాయ్, యాష్లే నర్స్, కీమో పాల్, కీరన్ పావెల్, రోవ్‌మన్ పావెల్, రోచ్, మార్లోన్ శామ్యూల్స్, ఓషేన్ థామస్.
టి20 జట్టు: కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలెన్ సునీల్, బ్రేవో, హెట్‌మెయిర్, మెకాయ్, యాష్లే నర్స్, కీమో పాల్, ఖారీ పియరే, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, రామ్‌దిన్, ఆండ్రీ రసెల్, రూథర్‌ఫోర్డ్, ఓషేన్ థామస్.
Comments
Please login to add a commentAdd a comment