సీపీఎల్-2022 సీజన్‌కు గానూ గయానా అమెజాన్ వారియర్స్ కెప్టెన్‌గా విండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ ఎంపికయ్యాడు. నికోలస్ పూరన్ స్థానంలో గయానా సారథిగా హెట్‌మైర్ నియమితుడయ్యాడు . ఈ ఏడాది సీజన్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున నికోలస్ పూరన్ ఆడనుండడంతో గయానా మేనేజేమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
హెట్‌మైర్ 2016లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అగేంట్రం చేసినప్పటి నుంచి అమెజాన్ వారియర్స్ జట్టలోనే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు పూరన్, షోయబ్ మాలిక్, క్రిస్ గ్రీన్ కెప్టెన్సీలో గయానాకు ప్రాతినిధ్యం వహించాడు. "2013 సీజన్ తర్వాత మా తొలి కెప్టెన్‌గా షిమ్రాన్ హెట్‌మైర్ నియమితుడైనందుకు మేము సంతోషిస్తున్నాము.
గత కొన్ని సీజన్ల నుంచి హెట్‌మైర్ మా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అతడు నాయకత్వం వహించడానికి ఇదే సరైన సమయం" అని అమెజాన్ వారియర్స్ చైర్మన్ బాబీ రామ్‌రూప్ పేర్కొన్నారు. ఇక సీపీఎల్‌లో ఇప్పటివరకు 47 మ్యాచ్‌లు ఆడిన హెట్‌మైర్ 1149 పరుగులు సాధించాడు. కాగా కరీబీయన్ ప్రీమియర్ లీగ్ ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో జమైకా తల్లావాస్, సెయింట్ కిట్స్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: ENG vs SA: పాపం ప్రోటీస్ కెప్టెన్.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుంది!
Comments
Please login to add a commentAdd a comment