సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్ 2021లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ చంద్రపాల్ హేమరాజ్(56 బంతుల్లో 105 నాటౌట్; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. గయానా వారియర్స్ బౌలర్లు ఇమ్రాన్ తాహిర్(3/34), రోమారియో షెపర్డ్(2/33), మోటీ(1/15), ఓడియన్ స్మిత్(1/22) దెబ్బకు బార్బడోస్ జట్టు పేకమేడలా కూలింది.
ఈ ఇన్నింగ్స్‌లో బార్బడోస్ ఆటగాళ్లు ముగ్గురు రనౌట్ కాగా, వికెట్‌కీపర్ అజామ్ ఖాన్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 131 పరుగుల ఛేదనలో హేమరాజ్ ఒక్కడే అజేయమైన 105 పరుగులు సాధించడంతో గయానా జట్టు 14.2 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా ప్రత్యర్ధిపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గయానా మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్(17 బంతుల్లో 19; 2 ఫోర్లు) వికెట్ బార్బడోస్ బౌలర్ యంగ్‌కు దక్కింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్(13 బంతుల్లో 8 నాటౌట్; ఫోర్)తో కలసి హేమరాజ్ గయానాను విజయతీరాలకు తీర్చాడు.An amazing performance by Chandrapaul Hemraj sees the Warriors star receive our @Dream11 MVP for match 16. #CPL21 #GAWvBR #Dream11 @CricketPlayedLouder pic.twitter.com/STQ2xb6N0r
— CPL T20 (@CPL) September 4, 2021
Take a bow Chandrapaul Hemraj what a performance 👏👏👏 #CPL21 #GAWvBR #CricketPlayedLouder pic.twitter.com/FA9xjmN7GU
— CPL T20 (@CPL) September 4, 2021
చదవండి: వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’
Comments
Please login to add a commentAdd a comment