కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024ను బార్బడోస్ రాయల్స్ విజయంతో ఆరంభించింది. ఆదివారం సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బార్బడోస్ రాయల్స్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బుడా ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. బార్బుడా బ్యాటర్లలో జ్యువెల్ ఆండ్రూ(48) మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లలో మెకాయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ, హోల్డర్ తలా రెండు వికెట్లు సాధించారు.
డికాక్ ఊచకోత..
అనంతరం 146 పరుగుల లక్ష్యాన్ని బార్బడోస్ రాయల్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో రాయల్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు మరో ఓపెనర్ కార్న్‌వాల్(34) సైతం దూకుడుగా ఆడాడు. ఆంటిగ్వా బౌలర్లలో వసీం ఒక్కడే వికెట్ సాధించాడు.
చదవండి: #Babar Azam: 'బాబర్ నీ పని అయిపోయింది.. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో'
Quinton de kock vs Antigua & Barbuda Falcons
87*(45) incl. 9 Fours | 5 Sixes | SR 193+ pic.twitter.com/4JXTBixj6Q— SuperGiantsArmy™ — LSG FC (@LucknowIPLCover) September 2, 2024
Comments
Please login to add a commentAdd a comment