కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో బార్బడోస్ రాయల్స్ మరో అద్భుత విజయం సాధించింది. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో బార్బడోస్ రాయల్స్ గెలుపొందింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది.
గయానా బ్యాటర్లలో షాయ్ హోప్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మొయిన్ అలీ(33), కీమో పాల్(30) తమవంతు ప్రయత్నం చేసినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. బార్బడోస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 3 వికెట్లు పడగొట్టగా.. హోల్డర్ రెండు వికెట్లు సాధించారు.
డికాక్ విధ్వంసకర సెంచరీ..
అంతకముందు బ్యాటింగ్ చేసిన బార్బోడస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బార్బోడస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఈ మ్యాచ్‌లో 68 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 115 పరుగులు చేశాడు. డికాక్‌కు ఇదే తొలి సీపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు హోల్డర్(10 బంతుల్లో 28,3 సిక్స్‌లు, ఒక ఫోర్) మెరుపులు మెరిపించాడు.
టాప్‌లో గయానా..
ఇక ఈ విజయంతో బార్బోడస్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన బార్బోడస్ నాలుగింట విజయం సాధించి టాప్‌లో కొనసాగుతోంది. బార్బోడస్ తర్వాత గయానా, ట్రినాబాగో నైట్‌రైడర్స్, సెయింట్ లూసియా వరుసగా ఉన్నాయి.
చదవండి: ఇద్దరం ఒకే జట్టుకు ఆడాము.. అయినా నన్ను స్లెడ్జ్ చేశాడు: ధ్రువ్
Comments
Please login to add a commentAdd a comment