రాణించిన డికాక్‌.. రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయం | CPL 2024: Barbados Royals Beat Antigua And Barbuda Falcons By 10 Runs Through DLS Method | Sakshi
Sakshi News home page

రాణించిన డికాక్‌.. రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయం

Published Thu, Sep 12 2024 3:08 PM | Last Updated on Thu, Sep 12 2024 4:12 PM

CPL 2024: Barbados Royals Beat Antigua And Barbuda Falcons By 10 Runs Through DLS Method

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 12) బార్బడోస్‌ రాయల్స్‌, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్‌పై రాయల్స్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జస్టిన్‌ గ్రీవ్స్‌ (61 నాటౌట్‌), సామ్‌ బిల్లింగ్స్‌ (56) అర్ద సెంచరీలతో రాణించారు. రాయల్స్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ తలో 2, కేశవ్‌ మహారాజ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు ఛేదనకు దిగిన రాయల్స్‌కు వరుణుడు వరుస క్రమాల్లో అడ్డుతగిలాడు. 14.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన రాయల్స్‌ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి రాయల్స్‌ 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి డీఎల్‌ఎస్‌ స్కోర్‌కు 10 పరుగులు అధికంగా ఉండింది. 

రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో క్వింటన్‌ డికాక్‌ (48), అలిక్‌ అథనాజ్‌ (34) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. రోవ్‌మన్‌ పావెల్‌ 15, డేవిడ్‌ మిల్లర్‌ 19 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫాల్కన్స్‌ బౌలర్లలో క్రిస్‌ గ్రీన్‌, రోషన్‌ ప్రైమస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది. బ్యాటింగ్‌లో 48 పరుగులు చేసి, వికెట్‌కీపింగ్‌తో ముగ్గురిని ఔట్‌ చేసిన డికాక్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

చదవండి: పొలార్డ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌: ఒక్క ఫోర్‌ లేదు! అన్నీ సిక్సర్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement