కరేబియన్ ద్వీపంలోని బార్బడోస్ నుంచి మాంచెస్టర్‌కు వెళుతున్న విమానం గాల్లో ఉండగా ఊహించని గందరగోళాన్ని ఎదుర్కొంది. విచిత్ర వాతావరణ పరిస్థితులతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. బెర్ముడాలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. విమానాన్ని అత్యవసర మళ్లింపు చేయడంతో ప్రయాణికులు క్రిస్మస్ పండగ రోజును, బాక్సింగ్ డేనాడు బెర్ముడాలో గడపాల్సి వచ్చింది.
డిసెంబర్ 24న మలెత్ ఏరో ఫ్లైట్ 225 మంది ప్రయాణికులతో బార్బడోస్ నుంచి ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది. ఇది ఉదయం 6 గంటలలోపు మాంచెస్టర్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే బయలుదేరిన రెండు గంటల తర్వాత ఎయిర్‌బస్ విమానం 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు, తీవ్రమైన గందరగోళాన్ని ఎదుర్కొంది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం దగ్గర్లోని బెర్మాడాకు మళ్లీంచారు. అక్కడ విమానం ల్యాండ్ అవుతుండగా 11 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరికి బర్ముడాలో చికిత్స అందించారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment