‘అక్షరా’లా పంజాబ్‌దే... | BT vs Punjab - Punjab Won | Sakshi
Sakshi News home page

‘అక్షరా’లా పంజాబ్‌దే...

Published Sun, Sep 21 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

‘అక్షరా’లా పంజాబ్‌దే...

‘అక్షరా’లా పంజాబ్‌దే...

బార్బడోస్‌పై నాలుగు వికెట్ల విజయం
మొహాలీ: పంజాబ్ లక్ష్యం 175 పరుగులు.... చివరి 12 బంతుల్లో 25 పరుగులు చేయాలి. రాంపాల్ బౌలింగ్‌కు దిగాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పెద్దగా అనుభవం లేని అక్షర్ పటేల్ (9 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. మూడు బౌండరీలు, ఓ సిక్సర్‌తో కేవలం ఐదు బంతుల్లోనే 19 పరుగులు చేసి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. దీంతో సీఎల్‌టీ20లో శనివారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్‌‌సపై విజయం సాధించింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన బార్బడోస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది.

రైఫర్ (42 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), మునవీరా (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు. అవానా 3, పెరీరా 2 వికెట్లు తీశారు.  అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. మిల్లర్ (34 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. సెహ్వాగ్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. చివర్లో మిల్లర్, అక్షర్ కలిసి 19 బంతుల్లో అజేయంగా 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. రాంపాల్, మెండిస్ చెరో రెండు వికెట్లు తీశారు. మిల్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
స్కోరు వివరాలు:
బార్బడోస్ ట్రైడెంట్స్ ఇన్నింగ్స్:
మునవీరా (సి) వోహ్రా (బి) అవానా 50; పెర్కిన్స్ ఎల్బీడబ్ల్యు (బి) అవానా 10; రైఫర్ నాటౌట్ 60; కార్టర్ (సి) మిల్లర్ (బి) అనురీత్ 20; ఫ్రాంక్లిన్ (సి) అవానా (బి) పెరీరా 10; చిగుంబురా (సి) అనురీత్ (బి) పెరీరా 3; హోల్డర్ (సి) మిల్లర్ (బి) అవానా 12; నర్స్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174.
 వికెట్ల పతనం: 1-54; 2-61; 3-106; 4-124; 5-131; 6-159. బౌలింగ్: అనురీత్ సింగ్ 4-0-32-1; అవానా 4-0-46-3; అక్షర్ పటేల్ 4-0-42-0; మాక్స్‌వెల్ 3-0-22-0; సెహ్వాగ్ 1-0-10-0; కరణ్‌వీర్ 1-0-6-0; పెరీరా 3-0-15-2
 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ ఎల్బీడబ్ల్యు (బి) మెండిస్ 31; వోహ్రా (సి) కార్టర్ (బి) రాంపాల్ 27; సాహా (సి) మునవీరా (బి) ఫ్రాంక్లిన్ 14; మాక్స్‌వెల్ (సి) నర్స్ (బి) రాంపాల్ 16; మిల్లర్ నాటౌట్ 46;  బెయిలీ (సి) ఫ్రాంక్లిన్ (బి) మెండిస్ 7;  తిసారా పెరీరా (సి) కార్టర్ (బి) నర్స్ 0; అక్షర్ పటేల్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 178.
 వికెట్ల పతనం: 1-41; 2-76; 3-95; 4-103; 5-127; 6-131
 బౌలింగ్: హోల్డర్ 3.4-0-38-0; రాంపాల్ 4-0-50-2; ఎమ్రిట్ 2-0-17-0; ఫ్రాంక్లిన్ 2-0-17-1; జీవన్ మెండిస్ 4-0-18-2; నర్స్ 4-0-32-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement