Update: బార్బడోస్‌లో హరికేన్ ప్రభావం తగ్గడంతో టీమిండియా ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరనుంది. భారతకాలమానం ఇవాళ సాయత్రం 6 గంటలకు భారత బృందం ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి టేకాఫ్ కానుంది. టీమిండియా రేపు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ల్యాండ్ కానుంది.
టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో గాలివాన (హరికేన్) బీభత్సం ఇంకా కొనసాగుతుంది. హరికేన్ తీవ్రత కారణంగా విమానాశ్రయం మూసివేయడంతో భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. బార్బడోస్‌లో భారత బృందం పరిస్థితి దయనీయంగా ఉందని తెలుస్తుంది. మన వాళ్లు బస చేస్తున్న హోటల్‌లో నీరు, విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు సమాచారం. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నట్లు తెలుస్తుంది. భారత ఆటగాళ్లంతా హోటల్‌కే పరిమితమయ్యారని సమాచారం.
ప్రకృతి శాంతిస్తే టీమిండియా ఇవాళ (జులై 2) మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయల్దేరవచ్చు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు. మరోవైపు టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలకు ఘన స్వాగతం పలకాలని యావత్ భారత దేశం ఎదురుచూస్తుంది. కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో టీమిండియా.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment