న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతి బోర్డ్ పరీక్షలకు ఫైనల్ డేట్‌షీట్‌ను గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షలను వచ్చే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. పదో తరగతి పరీక్షలు మార్చి 10వ తేదీతో, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తాయని చెప్పారు.
రెండు సబ్జెక్టుల మధ్య విద్యార్థులకు అవసరమైన మేర విరామం ఉంటుందని తెలిపారు. 12వ తరగతి విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని, ఫైనల్ డేట్‌షీట్‌ను రూపొందించామన్నారు. ప్రవేశ పరీక్షల కంటే ముందుగానే ఈ పరీక్షలు ముగుస్తాయని సీబీఎస్‌ఈ ఎగ్జామినేషనల్ కంట్రోల్ సన్యమ్ భరద్వాజ్ చెప్పారు.


