
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 2026లో జరగబోయే 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు తేదీలను ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 9 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయని తెలిపింది.
సెప్టెంబర్ 24న బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో బోర్గు పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీటిని తాత్కాలికమైనవిగా గమనించాలని సీబీఎస్‌ఈ తెలియజేసింది. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు తమ అధ్యయనాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ తాత్కాలిక షెడ్యూల్ దోహదపడుతుందని బోర్డు తెలిపింది. ప్రతి పరీక్ష నిర్వహించిన 10 రోజుల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని పేర్కొంది. సీబీఎస్‌ఈ తెలిపిన వివరాల ప్రకారం 2026లో దాదాపు 45 లక్షల మంది అభ్యర్థులు 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరుకానున్నారు.