CBSE board
-
ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది. పదో తరగతి పరీ క్షలు మార్చి 18వ తేదీన ముగియ నున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ నాలుగో తేదీన ముగియనున్నాయి. సీబీఎస్ ఈ 86 రోజుల ముందుగానే బోర్డ్ పరీక్షల తేదీలను ప్రకటించడం ఇదే తొలిసారి. ‘‘ప్రతి రెండు సబ్జెక్ట్ పరీక్షల మధ్య సరిపోను వ్యవధి ఉండేలా చూశాం. 40,000 సబ్జెక్ట్ కాంబినేషన్లను దృష్టిలో ఉంచుకుని పరీక్ష తేదీల ను సిద్ధంచేశాం. -
గుడ్‌న్యూస్.. వరద బాధితులకు ఉచితంగా ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, సెప్టెంబర్‌లో సంభవించిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోయారు. ఇలాంటి వారికి ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు/ డూప్లికేట్ సర్టిఫికెట్లు అందించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించినట్లు ఇంటర్ విద్య కార్యదర్శి కృతికా శుక్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఐవోలు, డీఐఈవోలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, లేదా నేరుగా బోర్డు అధికారులను గాని సంప్రదించాలని సూచించారు.పదో తరగతి హిందీ సిలబస్ కుదింపుసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లను ప్రభుత్వం స్టేట్ సిలబస్‌లోకి మార్చిన నేపథ్యంలో ఆయా స్కూళల్లో సిలబస్‌ను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హిందీ సిలబస్ అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని చాప్టర్లను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్కూళ్ల విద్యార్థులకు జూన్– జూలై సిలబస్‌తో ఎఫ్ఏ–1 హిందీ నమూనా పరీక్షను మంగళవారం పూర్తి చేశామని తెలిపారు. అలాగే, కొత్త విధివిధానాల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు హిందీ సిలబస్ అధికంగా ఉన్నందున పద్యభాగ్–7 (ఆత్మత్రాణ్), గద్యభాగ్–11 (తీసరీ కసమ్ కే వశల్ పకార్ శేలేంద్ర), గద్యభాగ్–12 (అబ్ కహా దూస్రోంకే దుఖ్ సే దుఖీ హోనీవాలీ), ఉపవాచక్–3 (టోపీ శుక్లా) పాఠాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. కేఎల్‌యూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదలతాడేపల్లిరూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష 2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యావిధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజినీరింగ్ కోర్సులకు మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
వెల్లడైన సీబీఎస్ఈ ఫలితాలు: విద్యార్థులకు మోదీ సందేశం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సోమవారం 2024 10వ తరగతి పరీక్షలతో పాటు 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. 10వ తరగతిలో ఈ ఏడాది మొత్తం 93.60 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 10, 12వ తరగతుల ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువమంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గత ఏడాదికంటే.. ఈ ఏడాది కొంత ఎక్కువగా ఉంది.సీబీఎస్ఈ ఫలితాలు వెల్లడయిన తరువాత ప్రధాని మోదీ 12వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ''12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఇదొక మైలురాయి మాత్రమే. భవిష్యత్తులో అపరిమితమైన అవకాశాలు ముందున్నాయి. మిమ్మల్ని ఉత్తేజపరిచి నడిపించే వాటిపైన దృష్టి పెట్టండి. మీ అద్వితీయమైన ప్రతిభ మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది'' అని ట్వీట్ చేశారు.Dear #ExamWarriors,Congratulations to all of you who have successfully passed the CBSE Class XII exams! I am immensely proud of your accomplishment and your relentless dedication. I also acknowledge the efforts of your supportive families and dedicated educators, whose…— Narendra Modi (@narendramodi) May 13, 2024 -
'ఇంటర్మీడియట్' పాసైన టీమిండియా స్టార్ ఓపెనర్
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించింది. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్‌ను క్లియర్ చేసిన షఫాలీ వర్మ.. తన మార్క్ షీట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "ఈ ఏడాది మరోసారి 80 ప్లస్ స్కోర్ సాధించాను. కానీ ఈ సారి మ్యాచ్‌లో కాదు, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌లో. మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని షఫాలీ తన పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చింది. కాగా కేవలం 15ఏళ్ల వయస్సులోనే షఫాలీ వర్మ భారత తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2019లో దక్షిణాఫ్రికాపై ఆమె తన తొలి మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు టీమిండియా తరపున 79 మ్యాచ్‌లు ఆడిన 2106 పరుగులు చేసింది. అదే విధంగా తొట్టతొలి మహిళల అండర్-19 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న మొదటి కెప్టెన్‌గా షఫాలీ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను షఫాలీ నేతృత్వంలో భారత జట్టు కైవసం చేసుకుంది. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షఫాలీ వర్మ.. తన జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా View this post on Instagram A post shared by Shafali Verma (@shafalisverma17) -
మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్
సాక్షి, అమరావతి: విద్యా పరంగా ప్రపంచంతో పోటీ పడేలా మన పిల్లలను తీర్చిదిద్దాలనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం, చిత్తశుద్ధి, ఆశయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే పిల్లలు సీబీఎస్ఈ బోర్డు (పదో తరగతి) పరీక్షలు సమర్థవంతంగా రాసేలా ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతోంది. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్య అందించేంబదుకు అవసరమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే 4.72 లక్షల మంది పిల్లలకు రూ.606.18 కోట్ల వ్యయంతో, 8వ తరగతి పాఠాలు చెప్పే 50,194 మంది టీచర్లకు రూ.64.46 కోట్లతో ప్రముఖ కంపెనీ శ్యామ్‌సంగ్ ట్యాబ్‌లను ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా అతి పెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఉచితంగా కంటెంట్‌ను ఇవ్వనుంది. రివర్స్ టెండరింగ్‌తో మార్కెట్ ధర కంటే తక్కువ ► జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15 తర్వాత 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్యామ్‌సంగ్ ట్యాబ్‌లను అత్యంత పారదర్శకంగా, రివర్స్ టెండరింగ్ ద్వారా బయట మార్కెట్ కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. ► మెమొరీ కార్డుతో సహా మూడేళ్ల వారంటీ వంటి ఫీచర్స్ అన్నీ కలిపితే బయట మార్కెట్లో శ్యామ్‌సంగ్ ఒక్కో ట్యాబ్ ఖరీదు రూ.16,446 చొప్పున.. 5.22 లక్షల ట్యాబ్‌లకు రూ.858.48 కోట్ల వ్యయం అవుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా వ్యవహరించడంతో ఒక్కో ట్యాబ్‌ను రూ.12,843 చొప్పున 5.22 లక్షల ట్యాబ్‌లను రూ.670.64 కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన రూ.187.84 కోట్లు ఆదా చేసింది. ► 5.22 లక్షల మంది 8వ తరగతి పిల్లలు, టీచర్లకు రూ.1,923.20 కోట్ల విలువైన బైజూస్ కంటెంట్‌ను, శ్యామ్‌సంగ్ ట్యాబ్‌లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి, టీచర్‌కు రూ.24 వేల విలువైన బైజూస్ కంటెంట్, రూ.12,843 ట్యాబ్ కలిపి మొత్తం రూ.36,843 విలువైన మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తోంది. ట్యాబ్‌ల ప్రత్యేకతలు ఇవీ.. ► ట్యాబ్‌లు, బ్యాటరీకి మూడేళ్ల వారంటీ (సాధారణంగా ఏడాది మాత్రమే) ఉంటుంది. ► మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ఫ్లిప్ కవర్‌తో 8.7 అంగుళాలు ఉంటుంది. ► పిల్లలు చూడకూడని సైట్లు బ్లాక్ చేసే సాఫ్ట్‌వేర్‌ను ట్యాబ్‌లలో లోడ్ చేసి ఇస్తారు. తద్వారా పిల్లలు అవాంఛనీయ సైట్ల జోలికి వెళ్లే అవకాశం ఏ కోశానా ఉండదు. ► కంటెంట్ డేటా కార్డుతో పాటు 64 జీబీ మెమొరీ కార్డు. ► ఏటా పదవ తరగతి వరకు విద్యార్థులకు ఇదే ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి ఇస్తారు. ► ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్, బైజూస్ కంటెంట్ ఇస్తారు. ► ఏదైనా రిపేరు వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే.. వారంలోగా సరిచేసి లేదా రీప్లేస్ చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీ పాడైపోయినా రీప్లేస్ చేయనున్నారు. ► విజువల్ గ్రాఫిక్స్‌తో కూడిన కంటెంట్‌ను ట్యాబ్‌లో అప్లోడ్ చేయడంతో పిల్లలు సులభంగా అర్థం చేసుకోనున్నారు. బైజూస్‌తో ఒప్పందంలో ముఖ్యాంశాలు ► ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. బైజూస్‌తో ఒప్పందంతో వీరందరికీ లెర్నింగ్ యాప్ ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది. ► 2025 నాటికి పదో తరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాసేందుకు వీలుగా వారిని సన్నద్ధం చేసేందుకు ఈ యాప్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. ► బైజూస్ లెర్నింగ్ యాప్‌లో బోధన అత్యంత నాణ్యతగా ఉంటుంది. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫ్స్ ద్వారా విద్యార్థులు మరింత సులభంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ► మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లిష్, అటు తెలుగు మాధ్యమంలోనూ అందుబాటులో ఉంటాయి. తద్వారా భాషా పరమైన ఆటంకాలు లేకుండా పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు ఉపయోగ పడుతుంది. ► వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టత, నాణ్యతతో ఉంటాయి. ► విద్యార్థులు ఎంత వరకు నేర్చకున్నారన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఫీడ్ బ్యాక్ పంపుతారు. ► సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా మ్యాపింగ్ చేస్తూ యాప్‌లో పాఠ్యాంశాలకు రూపకల్పన చేశారు. సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టులో.. ప్రతి అధ్యాయంలోనూ వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది. ► 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్ గేమ్స్ కూడా యాప్‌లో ఉంటాయి. ► పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, గేమ్స్, అనుకరణ.. అన్నీ యాప్‌లో పొందుపరిచారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు మ్యాథ్స్‌లో ఆటో సాల్వర్ స్కాన్ క్వశ్చన్స్ (లైవ్ చాట్ పద్ధతిలో నేరుగా), స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఈ యాప్ ద్వారా లభిస్తాయి. ► తరచూ సాధన చేయడానికి వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులోకి వస్తాయి. ► విద్యార్థి నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తారు. ఆన్లైన్లో ఉపాధ్యాయుడితో మీటింగ్ కూడా ఉంటుంది. -
సర్కారు బడుల్లో.. సీబీఎస్ఈ పాఠాలు
కడప ఎడ్యుకేషన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నాడు– నేడు పనులతో ఇప్పటికే ఊరి బడిని ఆధునిక హంగులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. తాజాగా రానున్న విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సిలబస్ బోధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు అనుగుణంగా వైఎస్సార్ జిల్లాలో సౌకర్యాలు ఉన్న 35 పాఠశాలల జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే బోధన ప్రారంభించనున్నారు. అందుబాటులోకి ఖరీదైన విద్య ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు ఖరీదైన విద్య అందుబాటులోకి రానుంది. సీబీఎస్ఈ సిలబస్‌తో పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవడం సులభం అవుతుంది. 35 పాఠశాలల్లో అమలు సీపీఎస్ఈ విధానం ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 2022–23 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈ సిలబస్‌కు మారనున్నాయి. ఇందులో కడప డివిజన్లో 17, ప్రొద్దుటూరు డివిజన్లో 8, రాయచోటి డివిజన్లో 10 హైస్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ బోధించనున్నారు. ఇందులో ఆరో తరగతిలో చేరితే ఇంటర్ విద్య వరకు ఇక్కడే పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. అత్యాధునిక పద్ధతిలో బోధన సీబీఎస్ఈ సిలబస్ అమలులో ఉన్న పాఠశాలల్లో బోధన అత్యాధునికంగా ఉంటుంది. విద్యాలయాల పర్యవేక్షణ సీబీఎస్ఈ బోర్డు పరిధిలో ఉంటుంది. ఆధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ బోధన కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు జేఈఈ, నీట్ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తారు. విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలు పెంచేలా సిలబస్ ఉంటుంది. ప్రతి తరగతికి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండటం ప్రత్యేకత. మంచి నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ అవసరం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్నతస్థాయి విద్య అందే అవకాశం ఉంటుంది. – మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, సంబేపల్లి హైస్కూల్ పేద విద్యార్థులకు వరం సీబీఎస్ఈ సిలబస్‌తో బోధన పేద విద్యార్థులకు వరం. ఇప్పటి వరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రమే ఉన్న సీబీఎస్ఈ సిలబస్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మారుమూల పల్లెకు కూడా చేరనుంది. – నారాయణ, ఎంఈవో, కడప ఉన్నతాధికారులకు నివేదిక పంపాం సీబీఎస్ఈ సిలబస్ బోధనకు అనుగుణంగా ఉన్న 35 స్కూళ్ల వివరాలను విద్యాశాఖ అధికారులకు పంపాం. అక్కడి నుంచి అనుమతులు వస్తే వచ్చే ఏడాది నుంచి ఆ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తాం. – శైలజ, డీఈవో, కడప -
ఎన్నారైలకు సీబీఎస్ఈ శుభవార్త! స్కూల్ అడ్మిషన్లపై కీలక ప్రకటన
విదేశాల్లో ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుభవార్త తెలిపింది. ఎన్నారై పిల్లల చదువుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇక్కడ చదివించాలంటే గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్తున్న ఇండియన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విదేశాల్లో విద్యా చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో కొందరు తమ పిల్లలను ఇండియాలో చదివించేందుకు మొగ్గు చూపుతుంటారు. మరికొందరు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు మిస్ అవకూడదని తమ సంతానానికి ఇండియాలో ఎడ్యుకేషన్ అందించాలని నిర్ణయించుకుంటారు. ఇలాంటి వారంతా తమ పిల్లలను ఇండియాలో సీబీఎస్ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న స్కూళ్లలో చేర్పిస్తుంటారు. ఇలాంటి ఎన్నారై విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి సీబీఎస్ఈ కొన్ని మార్గదర్శకాలు అమలు చేస్తోంది. గతంలో సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం ఇక్కడి స్కూళ్లలో అడ్మిషన్ పొందాలంటే విదేశాల్లో సీబీఎస్సీకి సరిసమానమైన సిలబస్ అందిస్తున్న ఎడ్యుకేషన్ బోర్డులకు అనుబంధంగా ఉన్న స్కూల్లో విద్యార్థులు చదువుతూ ఉండాలి. ఇందుకు సంబంధించిన పత్రాలను సీబీఎస్ఈకి సమర్పించాలి. వాటిని పరిశీలించి సీబీఎస్ఈ అప్రూవల్ ఇస్తుంది. ఆ తర్వాతే స్థానికంగా అడ్మిషన్లు ఖరారు అవుతాయి. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చేపట్టే అడ్మిషన్లలో ఈ రూల్ ఇప్పటి వరకు ఫాలో అవుతూ వస్తున్నారు. కోవిడ్ కారణంగా కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో నిబంధనలు కఠినతరమయ్యాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. లేదంటే జీతాల్లో కోత పడింది. దీంతో తమ పిల్లలను ఇండియాలో చదివించాలని భావించే పేరెంట్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే సీబీఎస్ఈ ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు వారికి అడ్డంకిగా మారాయి. చేర్చుకోండి ఎన్నారైలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రూల్స్‌ని సీబీఎస్ఈ సడలించింది. సీబీఎస్ఈకి సరి సమానమైన సిలబస్ అందించని విదేశీ బోర్డులకి అనుబంధంగా ఉన్న స్కూళ్లలో చదివిన విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముందస్తుగా బోర్డు నుంచి ఎటువంటి అప్రూవల్ లేకుండానే అడ్మిషన్ ఇవ్వవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో విద్యార్థిని పరీక్షించి నిర్ణయం తీసుకోవచ్చంది. చివరగా అడ్మిషన్లు ఖరారు చేసేందుకు బోర్డుకు రిక్వెస్ట్ చేయాలని సూచించింది. సీబీఎస్ఈ తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఇబ్బందులు పడుతున్న ఎన్నారైలకు ఊరట లభించనుంది. చదవండి: ఎన్నారైలు.. తరాలు మారినా.. మూలాలు మరవడం లేదు -
సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల ప్రణాళిక
-
30:30:40 ఫార్ములాతో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు
న్యూఢిల్లీ: 12వ తరగతి మార్కుల నిర్థారణ విధానాన్ని సీబీఎస్ఈ గురువారం ప్రకటించింది. 10,11వ తరగతి మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా 30:30:40 ఫార్ములా ఆధారంగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్కుల ప్రణాళికను సీబీఎస్ఈ బోర్డు గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇందులో 10,11 తరగతుల మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీ, 12వ తరగతిలో టెర్మ్ పరీక్షల నుంచి 40 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.ఈ విధానంతో సంతృప్తి చెందనివారు పరీక్షలకు హాజరుకావొచ్చని పేర్కొంది. కాగా జూలై 31లోపు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలవుతాయని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. చదవండి: 12వ తరగతి ఫలితాల నిర్ధారణపై కమిటీ -
కాంగ్రెస్ అన్యూహం: ప్రధానమంత్రి మోదీపై ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశంసించింది. వెల్డన్ మోదీ అంటూ కొనియాడింది. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మొత్తానికి తాము ఇచ్చిన సలహాను పాటించారని పేర్కొంది. దేశ హితం కోసం రాహుల్, ప్రియాంకగాంధీ ఎంతదూరమైనా వెళ్తారు. ప్రజల మెరుగైన భవిష్యత్ కోసం కలిసి పని చేయడం ప్రాథమిక విధి. అహంకారం కంటే దేశ శ్రేయస్సుకే ప్రధాన పీట వేశారు’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను బుధవారం రద్దు చేసింది. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అంతకుముందు ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ మొగ్గు చూపడంతో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమైన మంత్రులు, విద్య శాఖ అధికారులు పై నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనపై ప్రియాంక గాంధీ కూడా ట్వీట్ చేసింది. 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. Well done Modi ji, listening to sound advice from Shri @Rahulgandhi, Smt. @priyankgandhi & the Congress party will go a long way in mending our nation. It is our democratic duty to work together for the betterment of our people. It's good to see BJP finally put nation over ego. https://t.co/oTGIy0iimb — Congress (@INCIndia) April 14, 2021 Glad the government has finally cancelled the 10th standard exams however a final decision MUST be taken for the 12th grade too. Keeping students under undue pressure until June makes no sense. It’s unfair. I urge the government to decide now.#cancelboardexam2021 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 14, 2021 -
సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతులకు సంబందించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్ నిషాంక్ నేడు ట్విటర్లో ప్రకటించారు. ఈ పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు జరగనున్నాయి.(చదవండి: ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్‌లైన్) షెడ్యూల్: మే 4 నుంచి జూన్ 7 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి మే 4 నుంచి జూన్ 11 వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జులై 15 తేదీలోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల పదో తరగతి పరీక్షలు రోజూ ఉదయం 10.30గం నుంచి మధ్యాహ్నం 1.30గం వరకు కొనసాగనున్నాయి. అలాగే, 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. తొలి షిఫ్ట్ ఉదయం 10.30గం నుంచి 1.30గం వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30గం నుంచి 5.30గం వరకు నిర్వహిస్తారు. మహమ్మారి కారణంగా10, 12 తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. కోవిడ్-19 పాండమిక్ ప్రోటోకాల్స్‌ను అనుసరించి పరీక్షలు జరుగుతాయి. ఫేస్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.nic.inను వీక్షించండి. -
సీబీఎస్ఈ రీ-ఎగ్జామ్.. భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేపర్ల లీకేజీ వ్యవహారంలో విద్యార్థులకు ఊరట లభించింది. పదో తరగతి మ్యాథ్స్ ఎగ్జామ్‌ను తిరిగి నిర్వహించబోవట్లేదని సీబీఎస్ఈ మంగళవారం ప్రకటించింది. సమగ్ర అధ్యయనం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ‘ విద్యార్థుల ఇబ్బందులు, పేపర్ లీకేజీ వ్యవహారం ప్రాథమిక విచారణ నివేదిక ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రీఎగ్జామ్ నిర్వహించకూడదని నిర్ణయించాం. ఇంతకు ముందు ప్రకటించినట్లు ఢిల్లీ, హరియాణాలో కూడా ఈ పరీక్ష నిర్వహించబోం’ అని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ ట్వీట్ చేశారు. (పేపర్ లీక్; షాకింగ్ ట్విస్ట్!) కాగా, పన్నెండో తరగతి ఎకనామిక్స్ పరీక్షను మాత్రం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఇదివరకే బోర్డు ప్రకటించింది. -
క్యాన్సర్‌తో బాధపడుతున్నా..
సాక్షి, బెంగళూర్ : బోర్డు పరీక్షలంటేనే విద్యార్థులు, తల్లితండ్రులకు విషమ పరీక్షగా మారాయి. క్యాన్సర్‌తో బాధపడుతున్న పదోతరగతి విద్యార్థి తనకు సహకరించేందుకు మరొకరిని అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని సీబీఎస్ఈ నిర్థయగా తోసిపుచ్చినట్టు సమాచారం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడు ఎక్కువసేపు కూర్చోలేనందున అతని తరపున పరీక్ష రాసేందుకు సహకరించేలా వేరొకరినీ అనుమతించాలని బాధిత విద్యార్థి తల్లితండ్రులు సీబీఎస్ఈకి లేఖ రాశారు. పరీక్ష కేంద్రంలోకి బాలుడి మందులు, ఆహారాన్ని అందుబాటులో ఉంచడానికి అనుమతించాలని కూడా లేఖలో వారు కోరారు. బెంగళూర్‌కు చెందిన మణిపాల్ హాస్పిటల్లో అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడికి కీమోథెరఫీ చికిత్స అందచేస్తున్నామని వారు బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తమ వినతిని బోర్డు తిరస్కరించిందని బాధిత విద్యార్థి మామ పనున్ కాశ్మీర్ కార్యకర్త పవన్ దురాని ట్వీట్ చేశారు. బోర్డు నిర్ణయం తనకు కన్నీళ్లు తెప్పించిందని, ఇంక మానవత్వం ఎక్కడ మిగిలుందని ప్రశ్నించారు. బాధిత విద్యార్థికి న్యాయం చేసేలా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి, మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్‌లకు ఆయన ట్వీట్ చేశారు. తమ వద్ద అన్ని మెడికల్ రిపోర్టులున్నాయని చెబుతూ ఆస్పత్రి సిఫార్సు లేఖనూ ఆయన జత చేశారు. -
వాటికి ‘ఏకరీతి మూల్యాంకనం’ రద్దు
న్యూఢిల్లీ: 6, 7, 8వ తరగతుల విద్యార్థులను ఉద్దేశించి గతంలో ప్రవేశపెట్టిన ఏకరీతి మూల్యాంకన విద్యావిధానాన్ని రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ విద్యావిధానంపై జాతీయ స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటుచేసిన కమిషన్ అభ్యతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏకరీతి మూల్యాంకన విధానం విద్యా హక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని కమిషన్ తెలిపింది. ఏకరీతి విద్యావిధానం, పరీక్షలతో పాటు రిపోర్టు కార్డులు ఇవ్వాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దుచేసింది. -
సీబీఎస్ఈ టాపర్ ఈ అమ్మాయే
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను ఆదివారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని రక్ష గోపాల్ 99.6 శాతంతో ప్రథమ స్ధానంలో నిలిచింది. డీఏవీ స్కూల్‌కు చెందిన భూమి సావంత్ డే 99.4 శాతం మార్కులతో రెండో స్ధానంలో నిలవగా, భవన్ విద్యాలయ పాఠశాలకు చెందిన ఆదిత్య జైన్ 99.2 శాతం మార్కులతో మూడో స్ధానం సంపాదించాడు. కాగా, గతేడాది కంటే ఉత్తీర్ణత ఒక శాతం తగ్గింది. 2016లో 83 శాతం మంది విద్యార్థులు పరీక్షలో పాసవ్వగా.. ఈ ఏడాది 82 శాతం మంది విజయవంతంగా 12వ తరగతిని పూర్తి చేశారు. ఫలితాల విడుదల అనంతరం ప్రకాశ్ జవదేకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. విజయం సాధించని విద్యార్థులు కుంగిపోకుండా మరింత కష్టపడాలని చెప్పారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో టాప్ రావడంపై మాట్లాడుతూ.. తాను టాపర్‌గా నిలిచానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని రక్ష గోపాల్ పేర్కొంది. పరీక్షలు రాసేప్పుడు బాగా రాయాలని భావించనని, టాపర్ కావాలని అనుకోలేదని తెలిపింది. -
తాపీమేస్త్రీ కొడుకు టాప్‌లేపాడు!
- జేఈఈ మెయిన్స్‌లో గుంటూరు విద్యార్థి ప్రతిభ - రాష్ట్రస్థాయిలో టాపర్, జాతీయస్థాయిలో 3వ ర్యాంకు కైవసం గుంటూరు: సీబీఎస్ఈ బోర్డు బుధవారం విడుదలచేసిన జేఈఈ-మెయిన్స్ ఫలితాల్లో గుంటూరు నగరానికి చెందిన మూల్పురు ప్రశాంత్‌రెడ్డి జాతీయస్థాయిలో 3వ ర్యాంకర్‌గా నిలిచాడు. గుంటూరులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివిన ప్రశాంత్‌రెడ్డి ఇంటర్మ్‌డియట్‌లో 987 మార్కులు సాధించాడు. ఈ నెల 3న జరిగిన జేఈఈ-మెయిన్స్‌కు హాజరై 360 మార్కులకు అత్యధికంగా 335 మార్కులు కైవసం చేసుకుని రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచాడు. ప్రశాంత్‌రెడ్డి తండ్రి శివరామకృష్ణారెడ్డి తాపీమేస్త్రీ. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ముంబై ఐఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపాడు.