సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సోమవారం 2024 10వ తరగతి పరీక్షలతో పాటు 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. 10వ తరగతిలో ఈ ఏడాది మొత్తం 93.60 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 10, 12వ తరగతుల ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువమంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గత ఏడాదికంటే.. ఈ ఏడాది కొంత ఎక్కువగా ఉంది.
సీబీఎస్ఈ ఫలితాలు వెల్లడయిన తరువాత ప్రధాని మోదీ 12వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ''12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఇదొక మైలురాయి మాత్రమే. భవిష్యత్తులో అపరిమితమైన అవకాశాలు ముందున్నాయి. మిమ్మల్ని ఉత్తేజపరిచి నడిపించే వాటిపైన దృష్టి పెట్టండి. మీ అద్వితీయమైన ప్రతిభ మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది'' అని ట్వీట్ చేశారు.
Dear #ExamWarriors,
Congratulations to all of you who have successfully passed the CBSE Class XII exams! I am immensely proud of your accomplishment and your relentless dedication. I also acknowledge the efforts of your supportive families and dedicated educators, whose…— Narendra Modi (@narendramodi) May 13, 2024
Comments
Please login to add a commentAdd a comment