భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించింది. సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్‌ను క్లియర్ చేసిన షఫాలీ వర్మ.. తన మార్క్ షీట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "ఈ ఏడాది మరోసారి 80 ప్లస్ స్కోర్ సాధించాను. కానీ ఈ సారి మ్యాచ్‌లో కాదు, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌లో. మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని షఫాలీ తన పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చింది.
కాగా కేవలం 15ఏళ్ల వయస్సులోనే షఫాలీ వర్మ భారత తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2019లో దక్షిణాఫ్రికాపై ఆమె తన తొలి మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు టీమిండియా తరపున 79 మ్యాచ్‌లు ఆడిన 2106 పరుగులు చేసింది. అదే విధంగా తొట్టతొలి మహిళల అండర్-19 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న మొదటి కెప్టెన్‌గా షఫాలీ చరిత్ర సృష్టించింది.
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను షఫాలీ నేతృత్వంలో భారత జట్టు కైవసం చేసుకుంది. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షఫాలీ వర్మ.. తన జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించింది.
చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment