సీబీఎస్‌ఈ రీ-ఎగ్జామ్‌.. భారీ ఊరట | CBSE Says No Re Exam for 10th Maths Paper | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 3 2018 2:31 PM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

CBSE Says No Re Exam for 10th Maths Paper  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) పేపర్ల లీకేజీ వ్యవహారంలో విద్యార్థులకు ఊరట లభించింది. పదో తరగతి మ్యాథ్స్‌ ఎగ్జామ్‌ను తిరిగి నిర్వహించబోవట్లేదని సీబీఎస్‌ఈ మంగళవారం ప్రకటించింది. సమగ్ర అధ్యయనం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. 

‘ విద్యార్థుల ఇబ్బందులు, పేపర్‌ లీకేజీ వ్యవహారం ప్రాథమిక విచారణ నివేదిక ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రీఎగ్జామ్‌ నిర్వహించకూడదని నిర్ణయించాం. ఇంతకు ముందు ప్రకటించినట్లు ఢిల్లీ, హరియాణాలో కూడా ఈ పరీక్ష నిర్వహించబోం’ అని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనిల్‌ స్వరూప్‌ ట్వీట్‌ చేశారు.  (పేపర్‌ లీక్‌; షాకింగ్‌ ట్విస్ట్‌!)

కాగా, పన్నెండో తరగతి ఎకనామిక్స్‌ పరీక్షను మాత్రం దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 25వ తేదీన  నిర్వహించనున్నట్లు ఇదివరకే బోర్డు ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement