
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అనిల్ స్వరూప్
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ పరీక్ష పేపర్ల లీకేజీ నేపథ్యంలో రీఎగ్జామ్ తేదీలను బోర్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన పన్నెండో తరగతి ఎకనామిక్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే టెన్త్ మ్యాథ్స్ ఎగ్జామ్ పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
పదో తరగతి గణిత పరీక్షలను కేవలం ఢిల్లీ, హరియాణాలో మాత్రమే నిర్వహించే అవకాశం ఉండొచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అనిల్ స్వరూప్ పేర్కొన్నారు. ఒకవేళ దేశమంతా నిర్వహించాలని నిర్ణయిస్తే మాత్రం జూలైలో పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏ విషయం అన్నది 15 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. అయితే విద్యార్థులకు నష్టం కలగకుండా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
ఇక పేపర్ల లీకేజీ వ్యవహారంలో విచారణ అనంతరం దోషులెవరైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని.. వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.