సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ పేపర్స్ లీక్ కుంభకోణంలో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు టీచర్లతో పాటు ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడున్నారు. ఔటర్ ఢిల్లీ ప్రాంతానికి చెందిన రిషబ్, రోహిత్ అనే టీచర్లు పేపర్ల ఇమేజ్‌లను తీసి వాటిని బవానా ప్రాంతానికి చెందిన కోచింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు తాకిర్‌కు పంపగా అతను వాటిని విద్యార్థులకు మళ్లించాడని పోలీసులు ఆరోపించారు.
సీబీఎస్‌ఈ పేపర్ లీకేజ్‌లో చేతిరాతతో కూడిన పేపర్ కూడా బహిర్గతం కావడంపై విచారణ పురోగతిలో ఉందని అధికారులు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి సరిగ్గా అరగంట ముందు పేపర్ లీక్ చోటుచేసుకుంది. మరోవైపు పేపర్ లీక్ అవుతోందని పదో తరగతి విద్యార్థి తన తండ్రి ఐడీని ఉపయోగించి సీబీఎస్‌ఈ బోర్డు చైర్‌పర్సన్‌కు మెయిల్ చేసిన క్రమంలో విద్యార్థితో పాటు ఆయన తండ్రిని కూడా అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకూ 53 మంది విద్యార్థులు, ఏడుగురు టీచర్లతో మొత్తం 60 మందిని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment