CBSE Paper Leak
-
‘సీబీఎస్ఈ’ లీకేజీ కేసులో ముగ్గురి అరెస్టు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఆర్థిక శాస్త్రం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షకంటే 3 రోజుల ముందే హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో ప్రశ్నపత్రం బయటకొచ్చిందని, తర్వాత కనీసం 40 వాట్సాప్ గ్రూప్‌లకు దీన్ని పంపారని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఉనాలోని డీఏవీ సెంటినరీ పబ్లిక్ స్కూల్‌కు చెందినవారు. వీరిలో ఒకరు ఆర్థికశాస్త్రం అధ్యాపకుడు కాగా మిగిలిన ఇద్దరు బోధనేతర సిబ్బంది. కంప్యూటర్ సైన్స్ పరీక్ష రోజైన మార్చి 23నే ఉనాలోని యూనియన్ బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్ నుంచి నిందితులు ఆర్థిక శాస్త్రం ప్రశ్నపత్రాన్ని బయటకు తీసి ప్రశ్నలను చేతితో రాసి ఆ కాగితాన్ని ఫొటో తీసి వాట్సాప్ గ్రూప్‌లలో పంపించారని పోలీసులు గుర్తించారు. -
ప్రతిపక్షాల మానవహారం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించటంలో అధికార ఎన్డీఏ విఫలమైందంటూ ప్రతిపక్షాలు గురువారం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ, వామపక్షాలు, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ తదితర 17 పార్టీల నాయకులు అరగంటపాటు మానవహారంగా ఏర్పడ్డారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు..’అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. మరోమార్గం లేకనే ప్రభుత్వ వైఖరిపై ఈ నిరసన తెలిపామన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చు కునేందుకు.. వేల కోట్ల పీఎన్బీ కుంభకోణం, ఎస్టీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు, సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీకేజీ తదితర అంశాలను తాము ప్రస్తావించకుండా అడ్డుకుం దని వివిధ పార్టీల నేతలు ఆరోపించారు. -
సీబీఎస్ఈ రీ-ఎగ్జామ్.. భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేపర్ల లీకేజీ వ్యవహారంలో విద్యార్థులకు ఊరట లభించింది. పదో తరగతి మ్యాథ్స్ ఎగ్జామ్‌ను తిరిగి నిర్వహించబోవట్లేదని సీబీఎస్ఈ మంగళవారం ప్రకటించింది. సమగ్ర అధ్యయనం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ‘ విద్యార్థుల ఇబ్బందులు, పేపర్ లీకేజీ వ్యవహారం ప్రాథమిక విచారణ నివేదిక ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రీఎగ్జామ్ నిర్వహించకూడదని నిర్ణయించాం. ఇంతకు ముందు ప్రకటించినట్లు ఢిల్లీ, హరియాణాలో కూడా ఈ పరీక్ష నిర్వహించబోం’ అని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ ట్వీట్ చేశారు. (పేపర్ లీక్; షాకింగ్ ట్విస్ట్!) కాగా, పన్నెండో తరగతి ఎకనామిక్స్ పరీక్షను మాత్రం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఇదివరకే బోర్డు ప్రకటించింది. -
జూలై వరకు ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవల సీబీఎస్ఈ పదో తరగతి గణితం పేపర్ లీకైన నేపథ్యంలో ఆ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారని ఈ సంస్థను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ లీకేజీ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ సోషల్ జ్యూరిస్ట్ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. గణితం పేపర్ ఎక్కడెక్కడ లీకయిందో పరిశీలిస్తున్నామనీ, జూలైలో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించే అవకాశముందని సీబీఎస్ఈ చెప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య విద్యార్థులను ముళ్లపై కూర్చోబెట్టడం లాంటిదేననీ, అసలు పరీక్ష నిర్వహణకు జూలైదాకా ఆగాల్సిన అవసరం ఏమొచ్చిందని న్యాయస్థానం ప్రశ్నించింది. గణితం పరీక్షను మళ్లీ నిర్వహించడంపై తమ అభిప్రాయాన్ని ఏప్రిల్ 16లోగా తెలియజేయాలని సీబీఎస్ఈ, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్క్రిప్టెడ్ విధానంలో సీబీఎస్ఈ పరీక్షలు పది, పన్నెండో తరగతి పరీక్ష పేపర్లు లీకైన నేపథ్యంలో సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా సరికొత్త విధానంలో సోమవారం పరీక్షల్ని నిర్వహించింది. పరీక్షకు కేవలం 15 నిమిషాల ముందు ఎన్క్రిప్టెడ్ ప్రశ్నపత్రాన్ని నిర్వాహకుల ఈ–మెయిల్‌కు సీబీఎస్ఈ పంపగా, వారు దాన్ని డౌన్‌లౌడ్ చేసుకున్నారు. కొన్నిచోట్ల బంద్ కారణంగా, మరికొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. -
ప్రశ్నపత్రం ఫొటో తీసి వాట్సప్‌లో..
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఆర్థికశాస్త్రం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. వీరిలో రిషబ్(29), రోహిత్(26)లు ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్లుగా పనిచేస్తుంటే.. తౌకీర్(26) ప్రైవేటు కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. ‘పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాన్ని ఉదయం 9.45 గంటలకు బయటకు తీయగానే రిషబ్, రోహిత్‌లు వాటి ఫొటోలు తీసి తౌకీర్‌కు పంపారు. అతను వాటిని తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు వాట్సప్ ద్వారా చేరవేశాడు. లీకైన ఆర్థికశాస్త్రం పేపర్‌ను అందుకున్న ఓ విద్యార్థితో పాటు సీబీఎస్ఈ ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నంబర్ల ఆధారంగా తౌకీర్‌ను అదుపులోకి తీసుకున్నాం’ అని కుమార్ తెలిపారు. రిషబ్, రోహిత్, తౌకీర్లు గత ఐదేళ్లుగా స్నేహితులనీ, తౌకీర్ ప్రోద్బలంతోనే ఇద్దరు నిందితులు ప్రశ్నపత్రం లీక్‌కు పాల్పడ్డారన్నారు. పేపర్ లీక్‌కు ప్రతిఫలంగా తౌకీర్ వీరిద్దరికీ రూ.2,000 నుంచి రూ.5,000 వరకూ ఇచ్చాడన్నారు. -
సీబీఎస్ఈ పేపర్ లీక్ : ముగ్గురు నిందితుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్ఈ పేపర్స్ లీక్ కుంభకోణంలో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు టీచర్లతో పాటు ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడున్నారు. ఔటర్ ఢిల్లీ ప్రాంతానికి చెందిన రిషబ్, రోహిత్ అనే టీచర్లు పేపర్ల ఇమేజ్‌లను తీసి వాటిని బవానా ప్రాంతానికి చెందిన కోచింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు తాకిర్కు పంపగా అతను వాటిని విద్యార్థులకు మళ్లించాడని పోలీసులు ఆరోపించారు. సీబీఎస్ఈ పేపర్ లీకేజ్‌లో చేతిరాతతో కూడిన పేపర్ కూడా బహిర్గతం కావడంపై విచారణ పురోగతిలో ఉందని అధికారులు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి సరిగ్గా అరగంట ముందు పేపర్ లీక్ చోటుచేసుకుంది. మరోవైపు పేపర్ లీక్ అవుతోందని పదో తరగతి విద్యార్థి తన తండ్రి ఐడీని ఉపయోగించి సీబీఎస్ఈ బోర్డు చైర్‌పర్సన్‌కు మెయిల్ చేసిన క్రమంలో విద్యార్థితో పాటు ఆయన తండ్రిని కూడా అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకూ 53 మంది విద్యార్థులు, ఏడుగురు టీచర్లతో మొత్తం 60 మందిని ప్రశ్నించారు. -
మాకెందుకీ ‘పరీక్ష’!
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం లీక్ ఘటనతో విద్యార్థిలోకం నైరాశ్యంలో కూరుకుపోయింది. ఏడాదంతా కష్టపడి చదివితే.. కొందరు స్వార్థపరులు దౌర్జన్యంగా తమ హక్కులను కాలరాస్తున్నారని మనోవేదన వ్యక్తం చేస్తోంది. పరీక్షలు పూర్తయి.. తదుపరి ప్రవేశ పరీక్షలకు కొందరు, సెలవులకు కొందరు ప్లాన్ చేసుకుంటున్న సమయంలో ఈ దారుణమైన వార్త తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన చెందుతున్నారు. బాధితుల్లో సాధారణ కుటుంబాల వారి నుంచి బడా రాజకీయ నేతల పిల్లలూ ఉన్నారు. ‘చాలా నిరాశగా ఉంది. పరీక్షకు ముందు రోజే ప్రశ్నాపత్రం లీకేజీ విషయం తెలిసి ఉంటే.. సీబీఎస్ఈ చైర్‌పర్సన్‌కు విషయం తెలిస్తే అప్పుడే పరీక్ష రద్దుచేయాల్సింది. ఎందుకింత సమయం వృథా చేస్తున్నారో అర్థం కావటం లేదు’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ కుమారుడు ఔజస్వి ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్నెందుకు ఇబ్బందిపెడతారు? సీబీఎస్ఈ 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు.. నిర్ణయించిన తేదీలకు సుమారు అటూ ఇటుగానే పలు జాతీయ, ప్రాంతీయ ఉన్నత విద్య కోర్సులకు ప్రవేశ పరీక్షలుండటంతో.. దేనికోసం సిద్ధం కావాలో తెలియక సతమతమవుతున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఎకనమిక్స్ వంటి కఠినమైన సబ్జెక్టు పరీక్షకు సిద్ధమవటం కష్టమైన పనేనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘పునఃపరీక్షకు నిర్ణయిస్తే.. మళ్లీ సిద్ధం కాక తప్పదు. కానీ ఇకపై పేపర్ లీక్ జరగదని అధికారులు భరోసా ఇవ్వాలి. మళ్లీ మళ్లీ పరీక్షలతో మమ్మల్నెందుకు ఇబ్బంది పెడతారు’ అని 12వ తరగతి విద్యార్థిని వంశిక బాధగా వెల్లడించారు. లీక్‌తో ఏమాత్రం సంబంధంలేని తమను.. ఇంత క్షోభపెట్టడం సరికాదంటున్నారు. అయితే పరీక్ష రాయటానికి ఇబ్బందేమీ లేదని.. కానీ.. మొదటిసారి రాసినంత ఉత్సాహంగా పరీక్ష రాయలేమంటున్నారు. ఈ లీక్ తర్వాత సీబీఎస్ఈపై నమ్మకం పోయిందంటున్నారు. ‘పరీక్షకు ముందురోజు రాత్రి.. లీకైన పరీక్షపేపర్ రూ.16వేలకు ఇస్తున్నారని.. అదే పరీక్షకు కొద్దిగంటల ముందైతే రూ.3వేలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇదెంత దారుణమైన విషయం. మా జీవితాలతో ఆడుకోవటం ఎందుకు?’ అని గురుగావ్‌కు చెందిన స్నేహ అగర్వాల్ అనే విద్యార్థిని ఆవేదనగా తెలిపారు. ‘విద్యార్థులతో సీబీఎస్ఈ చైర్పర్సన్ సమావేశం ఏర్పాటుచేసి.. ఇకపై లీక్ జరగదని భరోసాగా చెప్పగలరా?’ అని ఆందోళన చేస్తున్న విద్యార్థులు ప్రశ్నించారు. సరైన సమాధానం వచ్చేంతవరకు నిరసనలు తగ్గవని స్పష్టం చేశారు. సీబీఎస్‌ఈదే బాధ్యత ‘బోర్డు ఎగ్జామ్ అంటేనే తెలియని ఆందోళన. ఈ పరిస్థితుల్లో ఏడాది చదివిందంతా ఇలా బూడిదలో పోసిన పన్నీరైంది. పరీక్షకు ముందురోజే పేపర్ లీక్ అయిందని తెలిసింది. అయినా మనకెందుకులే అని సిద్ధమై.. పరీక్ష హాల్‌కు వెళ్లే సరికి ప్రతి ఒక్కరికీ లీక్ గురించి తెలిసిందని అర్థమైంది. పరీక్ష బాగా రాశామని సంబరపడుతుండగానే.. ఈ వార్త ఉలిక్కిపడేలా చేసింది. మళ్లీ గణితం పరీక్ష రాయాలా? అని భయమేస్తోంది. అసలు ఈ ఘటనంతటికీ సీబీఎస్‌ఈదే పూర్తి బాధ్యత. ఇటీవలి కాలంలో బోర్డు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు ఇలాగే ఉంటున్నాయి. దీంతో వ్యవస్థపై నాకు పూర్తిగా నమ్మకం పోయింది’ అని శ్రీజన్ సిన్హా అనే పదో తరగతి విద్యార్థిని పేర్కొంది. మరో లీక్ కలకలం ► అవి వదంతులేనన్న సీబీఎస్ఈ ► జార్ఖండ్‌లో ఇద్దరు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ల అరెస్టు న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగానే.. మరో లీకేజీ జరిగిందన్న వదంతులు కలకలం సృష్టించాయి. సోషల్ మీడియాలో 12వ తరగతి హిందీ, పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రాలు లీకైనట్లు.. వార్తలు రావటంపై సీబీఎస్ఈ తీవ్రంగా స్పందించింది. లీక్ జరగలేదని.. వాట్సప్, యూట్యూబ్.. తదితర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని స్పష్టం చేసింది. ‘సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న ఈ రెండు పేపర్లు గతంలోనివే. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారం ప్రసారం చేయవద్దు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయొద్దు’ అని సీబీఎస్ఈ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, పరీక్షకు ముందురోజే.. పదవతరగతి ప్రశ్నాపత్రం సీబీఎస్ఈ చైర్పర్సన్ అనిత కార్వాల్కు ఈ–మెయిల్లో రావటంపై వివరాలివ్వాలంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తిపై గూగుల్ సమాధానమిచ్చింది. ఓ పదోతరగతి విద్యార్థి వాట్సప్ ద్వారా తనకు వచ్చిన ప్రశ్నాపత్రాన్ని.. తండ్రి ఈ–మెయిల్ ద్వారా సీబీఎస్ఈ చైర్‌పర్సన్‌కు పంపారని ఢిల్లీ కమిషనర్ (క్రైం) ఆర్పీ ఉపాధ్యాయ వెల్లడించారు. ఆ విద్యార్థిని, ఆయన తండ్రిని విచారిస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 60 మందిని పోలీసులు విచారించారు. ఢిల్లీతోపాటు నగర శివార్లలో ఉన్న కోచింగ్ సెంటర్లు, పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నించారు. అయినా ఇంతవరకు ఎలాంటి సమాచారం దొరకలేదని తెలిసింది. 12వ తరగతి ఎకనమిక్స్ పునఃపరీక్షకు సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పరీక్ష నిర్ణయాన్ని రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీలోని శకర్పూర్కు చెందిన రీపక్ కన్సాల్, కొచ్చికి చెందిన రోహన్ మ్యాథ్యూ వేర్వేరు పిటిషన్లు వేశారు. జార్ఖండ్‌లో ప్రకంపనలు సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం లీక్ తాలూకూ ప్రకంపనలు జార్ఖండ్‌లోనూ కనబడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఛాత్రా జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల డైరెక్టర్లు (ఇద్దరు), నలుగురు విద్యార్థులను (10, 11 తరగతి విద్యార్థులు) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలోని సీబీఎస్ఈ కార్యాలయం ముందు విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రీత్ విహార్‌లోని కార్యాలయం ముందున్న రోడ్డును బ్లాక్ చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. -
సీబీఎస్ఈ పేపర్ లీక్; షాకింగ్ ట్విస్ట్!
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. సిట్ ఆధికారుల బృందం చేపట్టిన దర్యాప్తులో అనేకానేక విషయాలు బయటపడుతున్నాయి. లీకేజీలో కీలక సూత్రధారులుగా భావిస్తోన్న వ్యక్తులంతా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో కీలక నేతలు కావడం విమర్శలకు దారితీసింది. పదో తరగతి మ్యాథ్స్ పేపర్ లీకేజీలో ప్రధాన ముద్దాయిగా అనుమానిస్తున్న సతీశ్ పాండేను ఇప్పటికే జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జత్రాహిబాగ్(జార్ఖండ్)లో‘స్టడీ విజన్’ పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తోన్న పాండే.. ఛాత్రా జిల్లా ఏబీవీపీ అధ్యక్షుడు కూడా. ఇటు ప్రభుత్వానికి, సీబీఎస్ఈ బోర్డుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో ఏబీవీపీ పాలుపంచుకోవడంపైనా మిగతా విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు షైలా రషీద్ శనివారం ఈ మేరకు చేసిన వరుస ట్వీట్లు వైరల్ అయ్యాయి. ‘‘మీరే లీకేజీలు చేస్తూ, తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీరే ఆందోళనలకు నాయకత్వం వహించడం ఎంత దారుణం..’ అని షైలా మండిపడ్డారు. అటు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు కూడా సతీశ్ పాండే ఫొటోలను సర్క్యులేట్చేస్తూ ఏబీవీపీ, దాని మాతృసంస్థ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. 12వ తరగతి ఎకనామిక్స్‌కు 25న రీ ఎగ్జామ్: పేపర్ లీకేజీ నేపథ్యంలో 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని చెప్పిన సీబీఎస్ఈ బోర్డు.. ఆ తేదిని ఏప్రిల్ 25గా పేర్కొంది. అయితే 10వ తరగతి మ్యాథ్స్ రీ ఎగ్జామ్ తీదీలపై ఇంకా స్పష్టత రాలేదు. కేవలం ఢిల్లీ, హరియాణాలో మాత్రమే టెన్త్ మ్యాథ్స్ రీ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉండొచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అనిల్ స్వరూప్ శనివారం మీడియాతో చెప్పారు. -
రీఎగ్జామ్ తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల లీకేజీ నేపథ్యంలో రీఎగ్జామ్ తేదీలను బోర్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన పన్నెండో తరగతి ఎకనామిక్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే టెన్త్ మ్యాథ్స్ ఎగ్జామ్ పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పదో తరగతి గణిత పరీక్షలను కేవలం ఢిల్లీ, హరియాణాలో మాత్రమే నిర్వహించే అవకాశం ఉండొచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అనిల్ స్వరూప్ పేర్కొన్నారు. ఒకవేళ దేశమంతా నిర్వహించాలని నిర్ణయిస్తే మాత్రం జూలైలో పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏ విషయం అన్నది 15 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. అయితే విద్యార్థులకు నష్టం కలగకుండా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఇక పేపర్ల లీకేజీ వ్యవహారంలో విచారణ అనంతరం దోషులెవరైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని.. వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. -
పేపర్ల లీకేజీ వ్యవహారం.. గూగుల్ సాయం
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్ఈ పేపర్ల లీకేజీ వ్యవహారం.. తిరిగి పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించటంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు లీక్ వ్యవహారంపై సీబీఎస్ఈకి ముందస్తు సమాచారం ఇచ్చిందెవరో కనిపెట్టే పనిలో ఢిల్లీ పోలీసులు తలమునకలైయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా దిగ్గజం గూగుల్‌ను ఆశ్రయించారు. శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ శాఖ గూగుల్‌కు ఓ లేఖ రాసింది. అందులో సీబీఎస్ఈకు వచ్చిన సందేశం తాలుకూ జీ మెయిల్ ఐడీ వివరాలను అందించాలని పోలీస్ శాఖ కోరింది. మరోవైపు బోర్డుకు వచ్చిన మరో ఫ్యాక్స్ సందేశంపై కూడా దర్యాప్తు చేపట్టింది. ఇక ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టిన వాట్సాప్ గ్రూపులు, వాటి అడ్మిన్లు.. అందులోని సభ్యులను కూడా విచారణ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే 30 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాళ్ల ఫోన్లు స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు. మార్చి 23వ తేదీన సీబీఎస్ఈ చైర్‌పర్సన్‌కు ఓ మెయిల్, ఫ్యాక్స్ వచ్చాయి. అందులో పన్నెండో తరగతి ఎకనామిక్స్ పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. అది జరిగిన కొన్ని రోజులకు పేపర్ నిజంగానే లీక్ కావటంతో బోర్డు ఖంగుతింది. 12వ తరగతి ఎకనామిక్స్, 10వ తరగతి మ్యాథ్స్ రెండు పేపర్లు లీక్ అయ్యాయి. అయితే లీక్ అయిన విషయం పరీక్ష కంటే కొన్ని గంటల ముందు తెలిసినప్పటికీ.. ఎగ్జామ్ రద్దు చేయకుండా గప్ చుప్‌గా పరీక్షలు నిర్వహించి.. ఇప్పుడు మళ్లీ రీ-ఎగ్జామ్ ప్రకటన చేయటంపైనే తీవ్ర దుమారం రేగుతోంది. ఈ మేరకు రాజకీయ పార్టీలు కూడా బోర్డు తీరును తప్పుబడుతున్నారు. ‘ప్రధాని స్పందించరేం?’ సీబీఎస్ఈ పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రధాని ఎందుకు స్పందించటం లేదని కాంగ్రెస్ కపిల్ సిబల్ మండిపడ్డారు. పేపర్ల లీకేజీకి బాధ్యలెవరైనా.. శిక్ష విద్యార్థులకు విధించటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జవదేకర్‌కు సిసోడియా లేఖ కేంద్ర మంత్రి జవదేవకర్‌కు ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖా మంత్రులతో చర్చించి రీ ఎగ్జామ్‌పై నిర్ణయం తీసుకోవాలని సిసోడియా లేఖలో కోరారు. ఒకట్రెండు రోజుల్లో రీ ఎగ్జామ్ తేదీలు రీ ఎగ్జామ్ తేదీలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన్ని కలిసిన సీబీఎస్ఈ విద్యార్థులతో ఆయన పేర్కొన్నారు.