న్యూఢిల్లీ: 6, 7, 8వ తరగతుల విద్యార్థులను ఉద్దేశించి గతంలో ప్రవేశపెట్టిన ఏకరీతి మూల్యాంకన విద్యావిధానాన్ని రద్దు చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ విద్యావిధానంపై జాతీయ స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటుచేసిన కమిషన్ అభ్యతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏకరీతి మూల్యాంకన విధానం విద్యా హక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని కమిషన్ తెలిపింది. ఏకరీతి విద్యావిధానం, పరీక్షలతో పాటు రిపోర్టు కార్డులు ఇవ్వాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment