తాపీమేస్త్రీ కొడుకు టాప్‌లేపాడు! | Prasanth reddy gets 3rd ranker in national level for JEE mains exam | Sakshi
Sakshi News home page

తాపీమేస్త్రీ కొడుకు టాప్‌లేపాడు!

Published Wed, Apr 27 2016 9:40 PM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

తాపీమేస్త్రీ కొడుకు టాప్‌లేపాడు!

తాపీమేస్త్రీ కొడుకు టాప్‌లేపాడు!

- జేఈఈ మెయిన్స్‌లో గుంటూరు విద్యార్థి ప్రతిభ
- రాష్ట్రస్థాయిలో టాపర్, జాతీయస్థాయిలో 3వ ర్యాంకు కైవసం


గుంటూరు: సీబీఎస్‌ఈ బోర్డు బుధవారం విడుదలచేసిన జేఈఈ-మెయిన్స్ ఫలితాల్లో గుంటూరు నగరానికి చెందిన మూల్పురు ప్రశాంత్‌రెడ్డి జాతీయస్థాయిలో 3వ ర్యాంకర్‌గా నిలిచాడు. గుంటూరులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివిన ప్రశాంత్‌రెడ్డి ఇంటర్మ్‌డియట్‌లో 987 మార్కులు సాధించాడు.

ఈ నెల 3న జరిగిన జేఈఈ-మెయిన్స్‌కు హాజరై 360 మార్కులకు అత్యధికంగా 335 మార్కులు కైవసం చేసుకుని రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచాడు. ప్రశాంత్‌రెడ్డి తండ్రి శివరామకృష్ణారెడ్డి తాపీమేస్త్రీ. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ముంబై ఐఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement